AP Schools Summer Holidays: ఏపీలో సమ్మర్ హలీడేస్ పొడిగింపు.. కీలక ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం..
ఆంధ్ర ప్రదేశ్ లో జూన్ 12 తో సమ్మర్ సెలవులు ముగుస్తాయి. విద్యార్థులంతా జూన్ 12 న పాఠశాలలకు రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పాఠశాలకు ఒకరోజు సెలవును పొడిగిస్తు ఏపీ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది.
చంద్రబాబు నాయుడు ఏపీముఖ్యమంత్రిగా 12 వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి హజరు కావడానికి వెళ్లేందుకు వీలుగాసెలవు పొడిగించమని ప్రభుత్వంను టీచర్ లు కోరారు.
టీచర్లు,ఉపాధ్యాయ సంఘాలు కోరిక మేరకు ఏపీ సర్కారు ఒక రోజు పాటు అంటే.. జూన్ 12 కు బదులు, ఏపీలో జూన్ 13 న స్కూల్ లు ఓపెన్ అవుతాయని తెలుస్తోంది.
చంద్రబాబు, కూటమిని ఏపీప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. తమకు మంచి చేస్తారని ప్రజలు భావిస్తున్నారు. ప్రత్యేక రాజధాని, ఏపీ స్పెషల్ స్టేటస్, పోలవరం లాంటి సమస్యలను బాబు పరిష్కరిస్తారని ఏపీ ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఏపీకి మూడు కేంద్ర మంత్రి పదవులను ఇచ్చింది. దీంతో ఏపీకి మంచి రోజులు వస్తున్నాయని తెలుస్తోంది. ఏపీకీ రావాల్సిన అన్నిరకాల నిధులను తీసుకొచ్చేలా నేతలు చూస్తున్నారు.
చంద్రబాబు వస్తే ఏపీలో జాబ్ లు, మరల పెట్టుబడులు,అన్నిరకాలడెవలప్ మెంట్ అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. అందుకు నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్లడానికి అందరు ఆసక్తి చూపిస్తున్నారు.