Anti ageing foods: ఈ 7 తింటే నిత్య యవ్వనం.. ఈరోజు నుంచి తిని చూడండి..
బెర్రీస్.. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్ వంటి బెర్రీ జాతి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నివారించి చర్మాన్ని కాపాడతాయి. ఈ రంగు రంగుల ఫ్రూట్లలో విటమిన్స్ సి పుష్కలంగా ఉంటుంది. మన స్కిన్ సాగే గుణాన్ని కాపాడుతుంది. దీంతో మన చర్మంపై గీతలు కూడా తగ్గిపోతాయి. మచ్చలేని యవ్వనంగా చర్మం కనిపిస్తుంది.
ఫ్యాటీ ఫిష్.. సాల్మన్, మెకారల్స్, సార్డినెన్ వంటి చేపల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన చర్నాన్ని ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. వాపు సమస్యను మంటను తగ్గిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తుంది హానికర యూవీ కిరణాల నుంచి మన చర్మాన్ని రక్షిస్తుంది.
ఆకుకూరలు.. ఆకుకూరలు లో కూడా చర్మాన్ని ఆరోగ్యంగా కనిపించేలా చేసే గుణం ఉంటుంది. పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో విటమిన్స్, మినరల్స్ , యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో ఎక్కువ శాతం విటమిన్ ఏ ఉండటం వల్ల చర్మ కణాలను పునరుజ్జీవణం అందుతుంది.
గింజలు, విత్తనాలు.. కొన్ని రకాల గింజలు, విత్తనాలు కూడా చర్మాని యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. బాదాం వాల్నట్స్, ఫ్లాక్ సీడ్స్ ,చియా సీడ్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. విటమిన్ ఇ, జింక్, సెలీనియం కూడా ఇందులో ఉంటాయి. ఇది మన చర్మాన్ని ఆరోగ్యవంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
అవకాడో.. అవకాడో చూడడానికి క్రీమీ గా ఉంటుంది ఇందులో మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది మన చర్మానికి మాయిశ్చరైజింగ్ అందిస్తుంది. మంట సమస్యలు తగ్గిస్తుంది. చర్మం ఎలాస్టిసిటీని పెంచుతుంది. అవకాడోలో విటమిన్ ఇ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మన చర్మం మెరుస్తూ కనిపించడానికి సహాయపడుతుంది స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది
గ్రీన్ టీ.. గ్రీన్ టీ లో కూడా ఎక్కువ మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో కెటాచిన్స్ ఉంటాయి. ఇది మన చర్మాన్ని సన్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. వాపు సమస్యను తగ్గిస్తుంది గ్రీన్ టీ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మన చర్మం సమస్యలు రాకుండా ఈవెన్ స్కిన్ టోను అందిస్తుంది.
డార్క్ చాక్లెట్.. ప్రతిరోజు కొద్ది మొత్తంలో డార్క్ చాక్లెట్ ను డైట్ లో యాడ్ చేసుకోవడం వల్ల మన చర్మానికి బూస్టింగ్ ఇస్తుంది. డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. హానికర యువి కిరణాల నుంచి కాపాడే బ్లడ్ సర్కులేషన్ ను పెంచి స్కిన్ కి హైడ్రేషన్ అందిస్తుంది.