Anupama Parameswaran: తెలుగు రాయడం నేర్చుకుంటున్న అనుపమ
తెలుగు బాగానే మాట్లాడే అనుపమకి తెలుగు రాయాలన్న మక్కువ మొదలైంది. దీంతో ఈ భామ అ.. ఆ..లు నేర్చుకుంటూ తెలుగు రాయడం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది. కొత్త లక్ష్యాన్ని ఇప్పుడే మొదలెట్టానని, థ్యాంక్స్ గోపీ గారు అంటూ పోస్ట్ చేసింది.
తెలుగు వచ్చినా.. రాకపోయిన ఇంగ్లీషులో మాట్లాడే హీరోయిన్లు ఉన్న ఈ కాలంలో.. అనుపమ పరమేశ్వరన్ తెలుగు రాయడం నేర్చుకోవడంపై టాలీవుడ్ ప్రేక్షకులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
అనుపమ పరమేశ్వరన్... ఇప్పటివరకు వరుసగా.. అ ఆ, ఉన్నది ఒకటే జిందగీ, శతమానం భవతి, హలో గురు ప్రేమ కోసమే, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐలవ్ యూ చిత్రాల్లో నటించింది.