Anupama Parameswaran: షర్టు మడతపెట్టి మాస్ లుక్ లో కెవ్వు కేక పుట్టిస్తోన్న అనుపమ పరమేశ్వరన్..
అనుపమ పరమేశ్వరన్.. లాస్ట్ ఇయర్ ‘టిల్లు స్క్వేర్’ మూవీతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో లిల్లి జోసెఫ్ పాత్రలో నెగిటివ్ షేడ్ లో అదరగొట్టేసింది.
అనుపమ పరమేశ్వర్ విషయానికొస్తే.. ఈమె కేరళలోని ఇరంజకుడాలో 1996 ఫిబ్రవరి 18న జన్మించింది. అంతేకాదు మలయాళ క్లాసిక్ హిట్ ‘ప్రేమమ్’ సినిమాతో నటిగా వెండితెరకు పరిచయమైంది. అందులో మేరీ జార్జ్ పాత్రలో హీరో ఫస్ట్ లవర్ పాత్రలో కెవ్వు కేక పుట్టిచ్చింది.
అదే సినిమా తెలుగులో అదే ప్రేమమ్ టైటిల్ తో నాగ చైతన్య హీరోగా తెరకెక్కింది. ఈ సినిమాలో సుమగా చైతూ ఫస్ట్ క్రష్ గా యాక్ట్ చేసి మెప్పించింది.
మలయాళీ భామ అయిన అనుపమకు తెలుగులో కెరీర్ ప్రారంభంలో ఛాన్సులు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీతో ముందుగా ఈ భామనే అనుకున్నారు. ఆ తర్వాత అనుపమ ప్లేస్ లో సమంతను తీసుకున్నారు. ఒకవేళ ఈ పాత్ర అనుపమకు దక్కి ఉంటే ఆమె రేంజే వేరే లెవల్లో ఉండేదనేది చెప్పాలి.
ప్రస్తుతం ఈమె స్టార్ హీరోల సరసన కాకుండా మిడ్ రేంజ్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారింది. నిఖిల్ సిద్దార్ధ్ తో చేసిన ‘కార్తికేయ 2’ తో ప్యాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది.
లాస్ట్ ఇయర్ ‘టిల్లు స్క్వేర్ మూవీతో హిట్ అందుకున్నా.. అనుపమకు పెద్దగా ఒరింగిందేమి లేదు. ప్రస్తుతం అనుపమ చేతిలో వివిధ భాషల్లో ఆరేడుకు పైగా సినిమాలున్నాయి.