Anushka Sharma: నైట్ టైమ్‌లో కోహ్లీ అలా చేయడం నచ్చలేదు.. బెడ్ రూమ్ సీక్రెట్ చెప్పేసిన అనుష్క శర్మ
రన్‌మెషిన్ విరాట్ కోహ్లీ క్రికెట్ తరువాత తన కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. మ్యాచ్‌ల్లేని సమయాల్లో ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్‌కు వెళుతుంటాడు.
ఇక అనుష్క శర్మ విరాట్ కోహ్లి వెన్నంటే ఉంటుంది. కోహ్లీ ఆడే మ్యాచ్‌లకు స్టేడియాలకు వెళ్లి ఉత్సాహపరుస్తుంది.
గతంలో ఈ జంట ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అనుష్క శర్మ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేశారు. విరాట్ కోహ్లీ నిద్రపోయే అలవాట్ల గురించి చెప్పారు.
తాము త్వరగా నిద్రపోతామని.. విరాట్ కోహ్లీ తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేస్తాడని తెలిపారు అనుష్క శర్మ. అయితే అలా చేయడం తనకు ఇష్టం లేదన్నారు.
అయితే వామిక పుట్టిన తర్వాత తమ దినచర్య చాలా మారిపోయిందన్నారు. పాప పుట్టాక ఏ పార్టీలకూ వెళ్లడం లేదని.. వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
విరాట్, తాను ఇద్దరూ ఇంట్లో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నామన్నారు. తాము సెలబ్రిటీలమే.. కానీ తమ వ్యక్తిగత జీవితాలను ఇష్టపడతామన్నారు. తాము చిన్న విషయాలలో ఆనందాన్ని పొందుతామన్నారు.