AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..
AP Liquor: ఆంధ్ర ప్రదేశ్ గత ప్రభుత్వం హయాములో జే బ్రాండ్ అంటూ అంత క్వాలిటీ లేని సరకును అమ్మడంపై అప్పట్లో మందు బాబులకు జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు.
అది ఓట్ల రూపంలో చూపించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంలో మిగతా ప్రజలతో పాటు మందు బాబుల పాత్ర కూడా ఉంది.
ఇప్పటికే కొత్త మద్యం పాలసీలో భాగంలో ప్రభుత్వ దుకాణాలు కాకుండా ప్రైవేటుగా మద్యం షాపులకు లాటరీ విధానంలో టెంటర్స్ పిలిచారు. అంతేకాదు లాటరీ విధానంలో ఎంపికైన వారికీ షాపులు కేటాయించారు.
ఇప్పటికే తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్న బ్రాండ్లను ప్రవేశ పెట్టింది. దీంతో పాటు తక్కువ ధరకు అంటే రూ. 99 కే లిక్కరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే కదా.
అంతేకాదు పండగ వేళ మద్యం షాపుల్లోకి మరిన్ని కొత్త బ్రాండ్స్ ను అందుబాటులోకి తీసుకొస్తామని ఎక్సైజ్ మంత్రి తెలిపారు. ప్రస్తుతం అతి తక్కువ రేటుకే మద్యం అందిస్తున్నామని చెప్పారు.
అంతేకాదు త్వరలో మందు రేట్లు తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. అందుకోసం ఓ కమిటీ కూడా ఫామ్ చేసినట్టు చెప్పారు.
అంతేకాదు మద్యాన్ని కూటమి ప్రభుత్వం ఆదాయ వనరుగా చూటటం లేదంటున్నారు. మొత్తంగా పండగ వేళ ఏపీ ప్రభుత్వం చెప్పిన ఈ న్యూస్ తో మందు బాబులు పండగ చేసుకుంటున్నారు.