Apple Fruit: డైలీ ఒక యాపిల్ పండు తింటే.. ఎన్ని రకాల వ్యాధులకు చెక్ పెట్టొచ్చో తెలుసా..?
ఆపిల్ ను రోజు తినడం వల్ల మన శరీరంకు కావాల్సిన విటమిన్ లు,మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. అంతే కాకుండా ఆపిల్ ను రోజు తినే వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.
కొందరు తరచుగా బీపీ, షుగర్ లతో బాదపడుతుంటారు. ఇలాంటి వారు యాపిల్ ను తింటే.. వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతే కాకుండా.. యాపిల్ ను తినడం వల్ల శరీరంలో పెనుమార్పులు సంభవిస్తాయి.
రోజు యాపిల్ ను తినే వారిలో రక్త ప్రవాహాం వేగంగా జరుగుతుంది. వీరిలో ఎలాంటి హర్మోనల్ సమస్యలు ఉండవు. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ లు ప్రతిరోజు కూడా ఆపిల్ ను తినాలని కూడా నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా రన్నింగ్ లు, జాగీంగ్ లకు పోయే వచ్చిన తర్వాత యాపిల్ ను తింటే.. అప్పటి వరకు అలిసి పోయిన శరీరంకు ఒక్కసారిగా అధిక మొత్తంలో సత్తువ లభిస్తుందని సమాచారం.
పీరియడ్స్ సమస్యలతో బాధపడుతున్న వారు, తెల్లవెంట్రుకలు వారు ఆపిల్స్ ను తింటే శరీరంలో అవి కల్గజేసే ప్రభావం వల్ల సమస్యలన్ని దూరమౌతాయంట.
బెల్లీ ఫ్యాట్ సమస్యలు, కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలతో చికాకులు పడే వారు ప్రతిరోజు తప్పనిసరిగా ఒక యాపిల్ ను తినాలని కూడా నిపుణులు సూచిస్తుంటారు.