iPhone Latest Update: ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్, లేటెస్ట్ అప్‌డేట్ అందుబాటులో
ఐఫోన్ ఎస్ఈ మోడల్ తరువాత మార్కెట్‌లో వచ్చిన ఐఫోన్ 6,7,8 లతో పాటు ఎక్స్‌ఆర్ సిరీస్, 11, 12, 13 మోడల్స్‌కు ఈ అప్‌డేట్ వర్తిస్తుంది. సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10.30 నిమిషాల్నించి ఈ అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
చివరిసారిగా ఐఫోన్ యూజర్లకు అందిన అప్‌డేట్ 14.8 వెర్షన్. ఇప్పుడు తాజాగా వచ్చిన ఐఓఎస్ 15 అప్‌డేట్ చేసుకుంటే ఫోన్ పనీతీరు మరింత మెరుగ్గా మారుతుంది. మరీ ముఖ్యంగా కనెక్టివిటీ, ఫోకస్ ఎక్స్‌ప్లోర్ విభాగాల్లో అప్‌డేట్ ఉపయోగపడుతుంది.
వరల్డ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో ఐఓఎస్ 15కు సంబంధించిన వివరాల్ని యాపిల్ సంస్థ వెల్లడించింది. అప్పట్నించి అప్‌డేట్ ఎప్పుడు విడుదలవుతుందా అని యూజర్లు ఆసక్తిగా ఎదురు చూశారు.
ఐఫోన్ యూజర్లు ఎదురుచూస్తున్న ఐఓఎస్ 15 అప్‌డేట్ విడుదలైంది. 2021 సెప్టెంబర్ 20 నుంచి ఈ అప్‌డేట్ కస్టమర్లకు అందుబాటులో రానుంది.