Belly Button: రాత్రి పడుకునే ముందు బొడ్డుపై ఇలా చేస్తే చాలు అద్భుతాలే!
ఆయుర్వేదం ప్రకారం రాత్రి పడుకునే ముందు బొడ్డుకు తేనె రాస్తే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని తెలిసింది.
నెయ్యిలో శరీరానికి ఉపయోగపడే విటమిన్ ఏ, ఈ, డీ, కే, బ్యూట్రిక్ యాసిడ్ అనే పోషకాలు ఉంటాయి. నెయ్యిలోని మినరల్ కంటెంట్ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.
రోజూ రాత్రి నిద్రపోయే ముందు నాభి (బొడ్డు)కి ఒక చుక్క నెయ్యి రాసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
రాత్రి పూట నాభికి నెయ్యి రాసుకుని నిద్రిస్తే మొటిమల సమస్యలు దూరమవుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.
చలికాలంలో పెదవులు పగిలిపోవడం సర్వసాధారణం. అయితే అన్ని సీజన్లలో ఎక్కువ నీరు తాగి పెదవుల సంరక్షణ తీసుకున్నా.. కొందరికి పెదాలు పగిలిపోయే సమస్య ఉంటుంది. నాభిపై నెయ్యి రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
రోజూ రాత్రి పడుకునే ముందు బొడ్డుకి నెయ్యి రాసుకుంటే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో చర్మం మెరుపు పెరుగుతుంది.
క్రమం తప్పకుండా బొడ్డుకు నెయ్యి రాయడంతో జుట్టు నాణ్యత కాపాడుకోవచ్చు. ఇది జుట్టు రాలడం సమస్యను నయం చేస్తుంది. జుట్టును మెరిసేలా చేస్తుంది. అనేక ఇతర జుట్టు సమస్యలను దూరం చేస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించలేదు.