Ar Rahman Divorce: ఏఆర్ రెహమాన్ డైవర్స్ క్యాన్షిల్..?.. ఆసక్తికరంగా మారిన సైరా లాయర్ వ్యాఖ్యలు..ఏమన్నారంటే..?

Fri, 29 Nov 2024-2:25 pm,

లెజండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన సతీమణితో విడాకులు తీసుకుంటున్న వార్త తెలిసిందే. ఈ క్రమంలో రెహమాన్ మాజీ సతీమణి.. సైరా భాను.. తమ 29 ఏళ్ల బంధానికి స్వస్తి చెప్తున్నట్లు తన లాయర్  వందనాషాతో ప్రకటన చేయించారు.

ఈ క్రమంలో బాలీవుడ్ తో పాటు.. సోషల్ మీడియాలో వీరి విడాకుల వార్తలపై పెద్ద ఎత్తున చర్చ జరిగిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో.. వీరికి ముగ్గురు సంతానం. కొందరైతే ఏకంగా రెహామాన్ తన దగ్గర పనిచేసే బాసిస్ట్ సింగర్ తో ఎఫైర్ పెట్టుకున్నారని, అందుకే విడాకుల వరకు వెళ్లారని ప్రచారం చేశారు. రెహమాన్ విడాకుల ప్రకటన జరిగిన కొన్నిగంటలకే.. మోహినీడే తన భర్తతో డైవర్స్ ప్రకటన చేయడం వివాదాస్పదంగా మారింది. 

ఈ నేపథ్యంలో దీనిపై మోహీడే.. రెహామాన్ తనకు తండ్రి లాంటి వారని.. ఇలాంటి రూమర్స్ వ్యాప్తి చేయోద్దని స్పష్టం చేసింది. అయితే.. రెహమాన్ తమ వ్యక్తిగత నిర్ణయంను దయచేసి అందరు గౌరవిస్తారని అనుకుంటున్నామని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సైరా భాను, వీరి సంతానం సైతం.. తమ తల్లిదండ్రుల నిర్ణయం ను అర్థం చేసుకొవాలని పోస్టులు పెట్టారు.  

ప్రస్తుతం సైరా భాను తరపున వాదిస్తున్న లాయర్ వందనాషా తాజాగా, ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారంట. రెహామాన్ విడాకులపై.. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తి కరంగా మారాయి. రెహమాన్.. సైరాభాను ఇద్దరు చాలా మాట్లాడుకుని డైవర్స్ వరకు వచ్చారన్నారు.

అయితే.. ముగ్గురు సంతానం మేజర్లు కాబట్టి.. ఎక్కడుంటారనేది వారి ఇష్టం. అంతే కాకుండా.. రెహామాన్.. సైరాభాను మళ్లీ కలసిపోయేందుకు కూడా అవకాశాలు లేకపోలేదని ఆమె అన్నారు. అదే విధంగా సైరా భాను.. ఆర్థిక అవసరాల కోసం విడాకులు తీసుకొలేదన్నారు. మరోవైపు ఇటీవల సైరా సైతం.. రెహమాన్ చాలా మంచి వాడని, తాను.. బాంబేలో ఉన్నానని.. దయచేసి రూమర్స్ వ్యాప్తి చేయోద్దని ఆమె ఒక వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.  

ఈ క్రమంలో వీరిద్దరు మళ్లీ కలిసిపోతున్నారా..?.. అన్న వార్తలు మాత్రం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్నాయి. వందనాషా ఇంటర్వ్యూలో.. అన్న మాటలతో రెహమాన్ అభిమానులతో పాటు.. ఆయన మేలు కోరే వారంతా ఒక్కసారిగా హ్యాపీగా ఫీలవుతున్నారంట. మరీ వీరి నిర్ణయం అఫిషీయల్ గా ఎలా ఉంటుందని నెటిజన్లు.. తెగ చర్చించుకుంటున్నారంట.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link