Aruguru Pativratalu: `ఆరుగురు పతివ్రతలు` అమృత గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తోంది తెలుసా?
ఆరుగురు పతివ్రతలు సినిమా ఆరుగురు చిన్న నటి స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. వీళ్లంతా పెళ్లయిన తర్వాత కలిసిన స్కూలు మాస్టర్ తో వారి వైవాహిక జీవితం గురించి ఒకరిని ఒకరు పంచుకునే కథ చుట్టూ తిరుగుతుంది.
2004లో విడుదలైన ఆరుగురు పతివ్రతలు సినిమాలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అమృత అనే హీరోయిన్ గురించి చెప్పుకోవాలి. తన బాయ్ ఫ్రెండ్, భర్త మధ్య నలిగిపోయే క్యారెక్టర్. ఈ సినిమాను ఈవివి సత్యనారాయణ కామెడీ సినిమాలు మాత్రమే కాదు రొమాంటిక్ యాంగిల్ కూడా చూపించగలరని నిరూపించుకున్నారు.
ఈ సినిమాలో తన భర్త సంసారానికి పనికి రాకపోవడంతో బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్న అమృత చేసిన క్యారెక్టర్ సీన్లు అప్పట్లో పెద్దగా చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చలేదు.. కానీ, ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు.
ఇక ఈ సినిమాలో నటించిన అమృత ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తుందని విపరీతంగా చాలా మంది సోషల్ మీడియాలో వెతుకుతూనే ఉంటారు. కానీ ఆమె ఇప్పటికీ ఎక్కడుందో తెలీదు. ఏ సినిమాలో కనిపించలేదు. అయితే కొన్ని విశ్వసనీయ సమాచారం మేరకు 2009లో అమృత ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది.
అమృత కన్నడ నటి. దాదాపు 8 సినిమాల్లో నటించింది. ఆరుగురు పతివ్రతలు సినిమా తర్వాత కూడా తనకి ఎక్కువగా అలాంటి రోల్సే రావడంతో సినిమాలకు గుడ్ బాయ్ చెప్పిందట.
అయితే గుజరాత్ కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలైపోయిందని తెలుస్తోంది. ఈ సినిమాలో అమృత నటన ఎప్పటికీ మర్చిపోలేనిది. ఈమె క్యారెక్టర్ తోనే ఈ సినిమా ఇప్పటికీ అందరి నోళ్ళల్లో ఊరుతోంది.
ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ ని త్వరగా మర్చిపోతారు. అయితే అమృత మాత్రం ఇప్పటికీ మర్చిపోలేని పాత్ర పోషించింది. ఇప్పటికీ సినిమాలోని సన్నివేశాలను మీమర్స్ విపరీతంగా వారి కంటెంట్ కోసం ఉపయోగించుకుంటారు.