August Wedding Dates: రేపటి నుంచి శ్రావణం.. మోగనున్న పెళ్లి భాజాలు, వివాహాలకు శుభ ముహూర్తాలు ఇవే..
అయితే, రేపటి నుంచి ఆగష్టు సోమవారం 5 నుంచి భాజభజంత్రీలు మళ్లీ మోగనున్నాయి. ఈ సందర్భంగా ఆగష్టు నెలలో వచ్చే పెళ్లిళ్లు శుభ ముహూర్తాలు తెలుసుకుందాం.
నేటి వరకు మూడాలు ఉండటంతో పెళ్లిళ్లు ఇతర శుభకార్యలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన మాసంగా హిందూ మతంలో పరిగణిస్తారు. ఈ నెలలో ఎన్నో శుభకార్యాలు, పండుగలు కూడా రానున్నాయి.
ముఖ్యంగా ఈ మాసంలో వరలక్ష్మి వత్రం, మంగళగౌరీ వ్రతం రాఖీపౌర్ణమి,కృష్ణ అష్టమి, అంతేకాదు ప్రతి శ్రావణ సోమవారం, మంగళవారం, శుక్రవారాలను కూడా అత్యంత పవిత్రంగా లక్ష్మీదేవితో పాటు ఇతర దేవుళ్లను పూజిస్తారు.
అయితే, శ్రావణ మాసంలో ఎక్కువ శాతం వివాహాలు జరుగుతాయి. ఈ సందర్భంగా 2024 ఆగష్టు 5 నుంచి శ్రావణం ప్రారంభంకానుంది. ఈ మాసంలో 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28, 30 పెళ్లిళ్లకు ముహూర్తాలు
అంతేకాదు ఈ తేదీల్లో గృహప్రవేశాలు ఇతర ప్రారంభోత్సవాలు కూడా జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)