Saturday Shani Remedies: శనిదోషంతో బాధపడుతున్నారా..?.. ఈ రెమిడీలు చేస్తే మీ లైఫ్ లో ఆకస్మిక ధనలాభం..

Fri, 21 Jun 2024-6:14 pm,

శనిదేవుడిని కర్మప్రభువు అంటారు. ఆయన మనం చేసిన కర్మలను బట్టి మంచి ఫలితాలు ఇస్తారు.అందుకే ఎల్లప్పుడు కూడా  మంచి పనులు చేయాలని జ్యోతిష్యులు చెబుతుంటారు. చెడు కర్మలు చేస్తే మనకు కలిగే ఫలితాలు కూడా అలాగే ఉంటాయని చెబుతారు.

ఈ నేపథ్యంలో.. శనివారం రోజున కొన్ని పరిహరాలు పాటించాలి. శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానాదులు పూర్తిచేసుకొవాలి. శనికి తైలాభిషేకం చేయించాలి. అంతేకాకుండా..నల్లనువ్వులు, తామర వత్తులతో దీపారాధాన చేయాలి. నల్లని క్లాత్ ను కూడా శనిభగవానుడికి సమర్పించాలి.

ముఖ్యంగా శనిదేవుడిని హనుమంతుడు, వెంకటేశ్వర స్వామి, శంకరుడు ఎంతో ఇష్టమైన దేవుళ్లని చెబుతుంటారు. అందుకు ఈరోజున వారికి ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఆయా దేవుళ్ల ఆలయాలకు వెళ్లిన కూడా శనిదేవుడు మనకు మంచిఫలితాలు ఇస్తాడంట

శనివారం రోజున రావిచెట్టు అడుగు భాగాన నీడలో దీపం పెట్టాలి. నల్ల చీమలకు చక్కెర, బెల్లంలను ఆహరంగా పెట్టాలి. కాకులకు,కుక్కలకు ఆహరం పెట్టాలి. శనివారం రోజుల పేదలకు స్వీట్లను తినడానికి పెట్టాలి. వస్త్రాలను దానంగా ఇవ్వాలి.

మరోవైపు శనివారం రోజున కొన్ని వస్తువులు ఇంట్లోకి అస్సలు తీసుకొని రావద్దు. ఉప్పు, కారం, ఇనుము వస్తువులు ఇంట్లోకి తీసుకొని రావద్దు. నువ్వుల నూనె, నల్లని బట్టలు తీసుకొని రావద్దు. ఈరోజు చెప్పులను కానీ బూట్లను కానీ కొనుగోలు చేయోద్దని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు.

శనివారంరోజున లవంగాలు, కర్పూరంలో కొన్నిపరిహరాలు పాటించాలి. కర్పూరంను ఇంట్లో వెలిగించి దానితో దిష్టిని తీసేయాలి. లవంగాలను తీసుకుని ఇంటి చుట్టు తిప్పి, వాటిని పారే నీళ్లలో వదిలేయాలి. ఇలా చేస్తే అతి కొద్దిరోజుల్లో శనిప్రభావం పూర్తిగా తగ్గిపోతుందని చెబుతుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link