David Warner: అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్.. వన్డేల్లో టాప్ రికార్డు ఇవే..
వార్నర్ 161 వన్డేల్లో 6932 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆసీస్ తరుఫున వన్డేల్లో అత్యధిక సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్లలో రికీ పాంటింగ్ తరువాత రెండో స్థానంలో ఉన్నాడు.
వార్నర్ అత్యుత్తమ వన్డే స్కోరు 179. 2017లో పాకిస్థాన్‌పై 128 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 179 రన్స్ చేశాడు.
ప్రపంచ కప్ కెరీర్‌లో 29 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 1,527 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ (2,278) అగ్రస్థానంలో ఉన్నాడు.
వన్డే ప్రపంచకప్‌లో వార్నర్ 6 సెంచరీలు చేశాడు. ఆసీస్ తరుఫున వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. ఓవరాల్‌గా సచిన్‌తో కలిసి రెండోస్థానంలో నిలిచాడు. టాప్ ప్లేస్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఉన్నాడు.
వార్నర్ 2015, 2023లో వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. వార్నర్ రెండు టోర్నమెంట్‌లలోనూ స్టార్‌గా నిలిచాడు. 2015 ప్రపంచకప్‌లో 8 మ్యాచ్‌లలో 345 పరుగులు, 2023లో 11 మ్యాచ్‌లలో 535 పరుగులు చేశాడు.
డేవిడ్ వార్నర్ తన వన్డే కెరీర్‌లో 18 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఆసీస్‌కు అవసరమైతే 2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి తిరిగి వస్తానని ట్విస్ట్ ఇచ్చాడు.