Sabarimala: అయ్యప్ప స్వాములకు మోడీ సర్కారు అదిరిపోయే శుభవార్త.. ఇకపై వాటికి చెల్లు..
Sabarimala: ప్రతి యేట శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికీ ఎంతో మంది భక్తులు అయ్యప్ప మాల వేసుకొని మండలం దీక్ష తర్వాత ఎంతో భక్తితో ఇరుముడితో స్వామి వారిని దర్శించుకుంటు ఉంటారు.
అయితే..ఇరుముడితో అయ్యప్ప స్వామిని సొంత వాహనాలతో పాటు రైళ్లలో వచ్చే ప్రయాణికులకు ఇరుముడి వల్ల ఎలాంటి ఇబ్బందులు పడటం లేదు.
కానీ విమానాల్లో ప్రయాణించి అయ్యప్ప దర్శనానికి వచ్చే అయ్యప్పలకు విమానాశ్రయాల్లో చెకింగ్ తో ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. దీంతో శబరిమల వెళ్ల అయ్యప్ప భక్తులకు పౌర విమానయాన శాఖ శుభవార్త అందించింది.
ఇరుముడితో కొండెక్కే భక్తుల కోసం నిబంధనలు సడలించింది. సెక్యూరిటీ స్కానింగ్ అనంతరం భక్తులు పవిత్రమైన ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్ లోనే ప్రయాణించే అవకాశాన్ని కేంద్ర విమానాయాన శాఖ కల్పించింది.
ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీంతో అయ్యప్ప దర్శనం కోసం శబరిమల వెళ్లే భక్తులకు పెద్ద ఉపశమనం అని చెప్పాలి. దీంతో కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కారుకు అయ్యప్ప భక్తులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.