Hair Care: జుట్టు దువ్వుతుంటే వెంట్రుకలు ఊడుతున్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటిస్తే మీ జుట్టు ఊడమన్నా ఊడదు
Hair Loss: తలపై వెంట్రుకలు రాలిపోతుంటే..ప్రాణాలు పోయినట్లు ఫీల్ అవుతుంటారు. మనం స్నానం చేసేటప్పుడు, నూనె రాసేటప్పుడు, దువ్వుతున్నప్పుడు దాడాపు ప్రతిరోజు 50 వెంట్రుకలు ఊడుతుంటాయి. అయితే ఇది సహజమే. అంతకుమించి వెంట్రుకలు రాలిపోతుంటే మాత్రం కాస్త కేర్ తీసుకోవాలి. దీనికోసం జుట్టును ఎలాగైనా కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
వెంట్రుకలు ఊడటం అనేది మనం తీసుకునే ఆహారం నుంచి శరీరంలోని తీవ్రమైన వేడి, ఒత్తిడి, ఆందోళనలు, కాలుష్యం, ఇవన్నీ కూడా కారణాలు అని వైద్యులు చెబుతున్నారు. ఈ కారణాలను తెలుసుకుని చికిత్స తీసుకుంటే జుట్టు రాలడాన్ని చక్కగా అరికట్టవచ్చని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు ఎలాంటి చికిత్సలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఆహారం: చేపలు, గుడ్లు, కొల్లాజెన్ అధికంగా ఉండే ఆహారం, ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్ ఉండే పదార్థాలతోపాటు బ్రొకలీ లాంటి తాజా పండ్లను తీసుకోవాలి. అంతేకాదు విటమిన్ సీ ఎక్కువ ఉండే ఆహారం, చిలగడ దుంపలు,త్రిఫల చూర్ణం, బృంగరాజ్, అశ్వగంధ చూర్ణాన్ని తీసుకోవాలి.
కొన్ని మిశ్రమాలతో తయారు చేసిన నూనెను జుట్టుకు రాస్తే జుట్టు రాలే సమస్యను తగ్గించవచ్చు. అవేంటో చూద్దాం. కోడి గుడ్డు, పెరుగు, అరటిపండు, ఆలివ్ నూనె, నిమ్మరసం, విటమిన్ ఈ క్యాప్సుల్ వీటిని తీసుకోవాలి.
తయారీ విధానం: 2 టేబుల్ స్పూన్ల పెరుగులో 1 గుడ్లు పగలగొట్టి పోయాలి. సగం అరటిపండు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఆలివ్ నూనెను అందులో కలపాలి. దీంట్లోనే విటమిన్ ఈ క్యాప్సుల్స్ కూడా వేయాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కుదుళ్ల వరకు బాగా పట్టించాలి. సుమారు 15-20 నిమిషాలు అలాగే ఉంచి మంచినీటితో శుభ్రం చేసుకోవాలి.