Cholesterol Lowering Tips: బాబా రాందేవ్ 5 టిప్స్ పాటిస్తే కొలెస్ట్రాల్ వేగంగా తగ్గడం ఖాయం
ఆనపకాయ జ్యూస్
బాబా రాందేవ్ సూచనల ప్రకారం కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఆనపకాయ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను వేగంగా తగ్గిస్తాయి. లిపిడ్ ప్రోటీన్‌ను బ్యాలెన్స్ చేస్తుంది.
అనులోమ- విలోమ ప్రక్రియ
అనులోమ-విలోమ ప్రక్రియ అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు బాబా రాందేవ్. ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు ఎడమ చేతి బొటనవేలితో కుడి నాసికా రంధ్రాన్ని మూసి కళ్లు మూసుకుని ఎడమ నాసికా రంధ్రంతో శ్వాస వదలాలి. కాస్సేపు ఇలా చేశాక దీనికి వ్యతిరేకంగా చేయాలి.
ఉచ్ఛాస నిశ్వాసలు
కొలెస్ట్రాల్ తగ్గించేందుకు రోజూ ఉదయం క్రమం తప్పకుండా కనీసం 10-15 నిమిషాలు ఉచ్చాస నిశ్వాసలు ప్రాక్టీస్ చేయాలని బాబా రాందేవ్ సూచిస్తున్నారు.
కొలెస్ట్రాల్ తగ్గించే సూచనలు
మీ శరీరంలో కొలెస్ట్రాల్ లక్షణాలు కన్పిస్తే వెంటనే కొన్ని టిప్స్ పాటించాలి. బాబా రాందేవ్ కొన్ని హోమ్ రెమిడీస్ పాటించమంటున్నారు.
శరీరంలో ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ పెరిగితే కన్పించే లక్షణాలు
శరీరంలో ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ పెరిగితే కాళ్లు-చేతుల్లో వాపు కన్పిస్తుంది. కళ్ల చివర్లో పసుపుగా పేరుకుపోయి కన్పిస్తుంది. కళ్లలోపల తెలుపు చారలు కన్పిస్తాయి.