Baba Vanga: 2025 లో రాబోయే అవాంతరాలు ఇవే.. బాబా వంగా చెబుతున్న భవిష్యవాణి వింటే భయపడాల్సిందే..

Wed, 01 Jan 2025-4:11 pm,

బాబా వంగా అనే బుల్గేరియన్ దివ్యదర్శి చేసిన భవిష్యవాణులు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ఆమె 2025లో ముఖ్యమైన సంఘటనలు చోటుచేసుకుంటాయని ముందుగానే ఊహించారు. యూరప్‌లో యుద్ధాలు, ఎలియన్లతో పరిచయం, టెలిపతి, వైద్యరంగంలో సాంకేతిక విజ్ఞానం వంటి అంశాలు ఈ భవిష్యవాణుల్లో ఆమె ప్రస్తావించారు.

బాబా వంగా చెప్పిన దాని ప్రకారం, 2025లో యూరప్‌లో తీవ్రమైన ఘర్షణలు జరగబోతున్నాయి. ఈ యుద్ధాల కారణంగా జనాభా తగ్గిపోతుందని ఆమె చెప్పారు. ఈ ఘర్షణలు యూరప్‌ రాజ్యంగ వ్యవస్థలపై కూడా ప్రభావం చూపవచ్చట.

వైద్యరంగంలో అనేక ఆశ్చర్యకరమైన మార్పులు రావచ్చని బాబా వంగా చెప్పారు. ల్యాబ్‌లో అవయవాలను సృష్టించడం, క్యాన్సర్, ఇతర రోగాలకు మందులు కనిపెట్టడం వంటి విజయాలు ఈ ఏడాదిలో చోటు చేసుకుంటాయి అని ఆమె భవిష్యవాణిలో చెప్పారు.  

2025లో టెలిపతి వాస్తవం అవుతుందని బాబా వంగా చెప్పారు. ఈ టెక్నాలజీ ద్వారా మనస్సుల్లో మాటల్ని నేరుగా కమ్యూనికేట్ చేయగలమని ఆమె ఊహించారు. అంతేకాకుండా, మానవులు ఎలియన్లతో పరిచయాలు ఏర్పరచుకుంటారని కూడా ఆమె చెప్పారు.

కోల్పోయారు. కానీ ఆమె భవిష్యత్‌ను చెప్పగల దివ్యశక్తి కలిగినవారని అందరూ చెప్తారు. ఇందిరా గాంధీ మరణం గురించి కూడా ఆమె ముందే చెప్పారు. 1996లో ఆమె మరణించినప్పటికీ, ఆమె భవిష్యవాణులు ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link