Honey Rose: లైంగిక వేధింపులపై సుదీర్ఘ పోస్ట్ పెట్టిన బాలకృష్ణ హీరోయిన్..!

Mon, 06 Jan 2025-11:01 am,

గత ఏడాది సంక్రాంతి కానుకగా బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది హనీ రోజ్. మలయాళం ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. దీంతో సినిమా విజయం సాధించింది.  ఫలితంగా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు.  కానీ ఈమెకు మాత్రం హీరోయిన్గా అవకాశాలు తలుపు తట్టలేదు. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ పలు ఈవెంట్లకు, షాపింగ్ మాల్స్ కి గెస్ట్ గా వెళ్తూ భారీగా సంపాదిస్తోంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక బిజినెస్ మాన్ నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు ఒక సుదీర్ఘ పోస్ట్ వదిలింది. మరి ఆ పోస్టులో ఏముందో ఎప్పుడు చూద్దాం..

“గత కొంతకాలంగా నేను ఒక బిజినెస్ మాన్ దాడికి బలవుతున్నాను. ఎక్కడపడితే అక్కడ నన్ను మాటలతో వేధిస్తున్నాడు.  రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నేను ఎందుకు ఇతడి వేధింపులను సహించాలి.  నాతో పాటు ఎంతమంది సెలబ్రిటీలు అతడి బిజినెస్ కు సంబంధించిన ఈవెంట్లకు వెళ్తారు.  కానీ అతడు మాత్రం నన్నే టార్గెట్ చేస్తున్నాడు. ప్రతిసారి నా పేరే వాడుతున్నాడు.  మొదట్లో మేనేజర్లు నన్ను కలిసేవారు.  కానీ ఇప్పుడు అతడే డైరెక్ట్ గా కలుస్తున్నాడు.  ఒకప్పుడు ఎంతో మర్యాదగా మాట్లాడిన అతను ఇప్పుడు పబ్లిక్ ఈవెంట్లలో డబుల్ మీనింగ్ డైలాగులతో నన్ను పిలుస్తూ నన్ను మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాడు,” అంటూ చెప్పుకొచ్చింది. 

“ఒకసారి నేను ఈవెంట్ కి వెళ్తే మీడియా ముందు నాపై చులకనగా వ్యాఖ్యలు చేశాడు.  అవి నన్ను చాలా బాధకు గురి చేశాయి.  అప్పుడు నేను మౌనంగా ఉన్నా.. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక ప్రోగ్రామ్ నిర్వాహకులకు ఫోన్ చేసి నాపై చీప్ కామెంట్లు చేస్తే సహించను అంటూ వార్నింగ్ ఇచ్చాను.  అప్పటినుంచి ప్రోగ్రామ్లకు నేను వెళ్లడం మానేశాను.”

“అయితే ఒకానొక సమయంలో ఒక ప్రోగ్రాం కి నేను వెళ్లగా అతడు కూడా గెస్ట్ గా వచ్చాడు.  అక్కడికి వెళ్ళాక నాతో డైరెక్ట్ గా మాట్లాడలేదు.  కానీ అందరి ముందు మళ్ళీ నాపై చీప్ కామెంట్స్ చేశారు. తర్వాత అతడి మేనేజర్ బిజినెస్ ప్రమోషన్ లో పాల్గొనమని ఆఫర్ ఇస్తే నేను కుదరదు అన్నాను. ఇకపై ఇలాంటివి చేస్తే సహించకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను,” అంటూ తన పోస్టులో తెలిపింది. హనీ రోజ్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link