Bandla Ganesh on Pawan Kalyan: మీకు తిరుగులేదు దేవర... పవన్ కల్యాణ్‌పై బండ్ల గణేశ్ లేటెస్ట్ కామెంట్స్...
'గన్ను పట్టినా.. పెన్ను పట్టినా... కత్తి పట్టినా... మైకు పట్టినా... ఏది పట్టినా... ఎవరిపై గురిపట్టినా... మీకు తిరుగులేదు దేవర...' అంటూ బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. హరిహర వీరమల్లు చిత్రంలోని కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ప్రస్తుతం పవన్ కల్యాణ్ రిహార్సల్స్ చేస్తున్నారు.
ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ టోడర్ లాజరోవ్ పర్యవేక్షణలో పవన్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలను హరిహర వీరమల్లు నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.
పీరియాడికల్ డ్రామాగా 'హరిహర వీరమల్లు' తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ రెండు విభిన్న కాలాల మధ్య సాగుతుందని చెబుతున్నారు. దీన్నిబట్టి పవన్ కల్యాణ్ ఇందులో రెండు గెటప్స్‌లో కనిపించే అవకాశం లేకపోలేదు.
ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
రూ.150కోట్లు-రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది.