Sheikh Hasina: షేక్ హసీనా ఆసక్తికరమైన విద్యార్హత.. ఆమె పొలిటికల్ కెరీర్ పై ఓ లుక్..!
ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు అధికార పార్టీ మద్దతుదారుల మధ్య దేశంలోని వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘర్షణల్లో 100 మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది.
బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో షేక్ హసీనా నిన్న సోమవారం రాజీనామా చేశారు అయితే, ఈమె ఎక్కువకాలం ప్రధానమంత్రిగా పనిచేసిన మహిళా ప్రధాన మంత్రుల్లో ఒకరు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా పనిచేస్తున్న ఈమె హఠాత్తుగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆమె తండ్రి షేక్ ముజీబుర్ రెహ్మాన్ ఈయన బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు 74 ఏళ్ల షేక్ హసీనా ఎన్నో ఏళ్లుగా బంగ్లాదేశ్ కు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు.
షేక్ హసీనా ఢాకా విశ్వవిద్యాయంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ని సంపాదించారు. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లో తండ్రి షేక్ ముజీబుర్ రెహ్మాన్ స్ఫూర్తితో రానిచ్చారు. అంతేకాదు షేక్ హసీనా బంగ్లాదేశ్ స్వతంత్ర ఉద్యమంలో కూడా చురుగ్గా విద్యార్థి కాలం నుంచే పని చేశారు
ఆమె రాజకీయ నైపుణ్యం నిబద్ధతకు పేరు. ఆర్థిక వృద్ధి, సామాజిక సంక్షేమం, దౌత్యపరమైన దృష్టితో ప్రధానమంత్రిగా 2009 నుండి వ్యూహాత్మకంగా ఈ దేశానికి ప్రధానిగా పనిచేశారు.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తుందని ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ సోమవారం తెలిపారు.