Bank Holiday: రేపు డిసెంబర్ 31 బ్యాంక్ హాలిడేనా? ఓపెన్ ఉంటాయా? చెక్ చేయండి..
బ్యాంకు సెలవులు ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ లేదా స్థానిక పండుగలు ప్రత్యేక దినాల ఆధారంగా ఉంటాయి. ఇవి కాకుండా ప్రతి రెండో, నాలుగో శనివారంతోపాటు ఆదివారాలు కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
అయితే, ఒక్కోనెలలో అప్పుడప్పుడూ నెలకు రెండు పబ్లిక్ హాలిడేలు వస్తాయి. అయితే, మన దేశంలో ప్రతి మొదటి, మూడు, ఐదో శనివారాలు కూడా బ్యాంకులు పనిచేస్తాయి. అయితే, ప్రతి శనివారం రాగానే బ్యాంకులు బంద్ ఉంటాయా? అనే సందేహం అందరిలో వస్తుంది.
బ్యాంకులు బంద్ ఉన్నా కానీ, సులభంగా ఇతర బ్యాంకు కార్యకలాపాలు మనం ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున బ్యాంకు డిపాజిట్ చేస్తే సమస్య అవుతుంది.
అప్పుడు నేరుగా బ్యాంకు అధికారులను తప్పకుండా కలవాల్సి ఉంటుంది. అయితే, డిసెంబర్ 31న బ్యాంకులు మేఘాలయాలో పనిచేయవు. కియాంగ్ నాన్గ్‌భా సందర్భంగా మేఘాలయాలో బ్యాంకులు బంద్ ఉంటాయి.
యూ కియాంగ్ నాన్గ్‌భా అనేది మేఘాలయాలో స్థానిక పండుగ.కియాంగ్ స్వాతంత్ర్య సమరయోధుడు ఆయన స్మారకార్ధం ఈ బంద్ పాటిస్తారు. అంతేకాదు మిజోరామ్‌లో కూడా రేపు బ్యాంకులు బంద్ ఉంటాయి. న్యూఇయర్ ఈవ్, లోస్సాంగ్ లేదా నామ్‌సూన్ కారణంగా అక్కడ కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి.