Bank Holiday: అక్టోబర్ 31 అన్ని బ్యాంకులకు సెలవు.. హైదరాబాద్‌లో ఏ రోజు బంద్ ఉంటాయి తెలుసా?
అక్టోబర్ 31 దీపావళి సందర్భంగా దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవు రానుంది. దీపావళి అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి వెలుగులు నింపుతుంది. దీపావళి పండుగను దేశవ్యాప్తంగా వైభవంగా నిర్వహించుకుంటారు. అందుకే ఆర్‌బీఐ ప్రకారం ఈరోజు సెలవు దినంగా పరిగణించారు.
సాధారణంగా అన్ని బ్యాంకులకు ప్రతి నెలలో ఆదివారం, రెండో, నాలుగో శనివారాల్లో సెలవు దినంగా పరిగణిస్తారు. కొన్ని ప్రాంతీయ పండుగలకు కూడా ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. అయితే, దీపావళి అంటే దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటారు. కాబట్టి అన్ని బ్యాంకులకు సెలవు వస్తోంది.
ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గోవా తదితర రాష్ట్రాల్లో అక్టోబర్ 31న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించారు. దీంతో బ్యాంకులకు సెలవు.కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం నవంబర్ 1న బంద్ రానుంది.
ఇప్పటికే అక్టోబర్ నెలలో చాలారోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలు, మహాత్మాగాంధీ జయంతితోపాటు దసరా సెలవుల వల్ల కూడా బ్యాంకులకు భారీగానే సెలవులు సెలవులు పాటించాయి.
ఇదిలా ఉండగా ఇటీవలె బ్యాంకులకు 5 వర్కిండ్ డే కు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది చివరి నెల వరకు దీనిపై క్లారిటీ రానుంది. లేదా 2025 మొదటి నెలలోనే ఉద్యోగులకు వారంలో కేవలం 5 రోజులే పని దినాలు కానున్నాయి. కానీ, వారు ప్రతిరోజూ 45 నిమిషాలపాటు అదనంగా పనిచేయాల్సి ఉంటుంది.