Bank Holidays: దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులకు 28, 29 తేదీల్లో వరుసగా 2 రోజులు సెలవు..
సెప్టెంబర్ చివరి వారం గడుస్తోంది. ఆ తర్వాత అక్టోబరు నెల ప్రారంభమవుతుంది. అయితే, ఈ నెలలో కూడా కేవలం 15 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. ముఖ్యంగా వచ్చే నెల పండుగల నేపథ్యంలో సెలవులు రానున్నాయి. బ్యాంకు లావాదేవీలు ఉంటే ముందుగానే చూసుకోండి.
సాధారణంగా బ్యాంకు సెలవులు అనేది స్థానికత పై కూడా ఆధారపడతాయి. సెప్టెంబర్ 28వ తేదీ అన్నీ రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవు ఎందుకంటే ఈరోజు నాలుగో శనివారం. అయితే, ఆ మరుసటి రోజు కూడా 29వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజు కూడా బ్యాంకులకు సెలవు. ఈ నేపథ్యంలో బ్యాంకు పనులు ముందుగానే పూర్తి చేసుకోవాలి.
అయితే, బ్యాంకులకు సెలవు ఉన్నా ఇతర బ్యాంకు పనులు యథావిధిగా కొనసాగుతాయి. ఇంటర్నెంట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయి. డబ్బులు అవసరం ఉంటే ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. నెట్, మొబైల్ బ్యాంకింగ్ సేవల ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అంతేకాదు యూపీఐ పేమెంట్ల ద్వారా కూడా నగదు చెల్లింపులు చేయవచ్చు.
ఇదిలా ఉండగా అక్టోబర్ నెలలో 15 రోజులపాటు బ్యాంకులకు సెలవు దినాలు రానున్నాయి. ఇందులో కొన్ని దేశవ్యాప్తంగా కాగా మరికొన్ని ప్రాంతీయ సెలవులు. దసరా రోజుల్లో కూడా సెలవులు రానున్నాయి.
ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం ప్రతి ఏడాది బ్యాంకు సెలవుల క్యాలండర్ ను విడుదల చేస్తుంది. రాష్ట్రాలవారీగా జరుపుకొంటున్న పండుగలు, ప్రాంతీయ ప్రత్యేక దినాలు వీకెండ్ సెలవులు దృష్టిలో పెట్టుకుని బ్యాంకు సెలవుల జాబితా ఆర్‌బీఐ విడుదల చేస్తుంది. అయితే, రెండో, నాలుగో శనివారాలతోపాటు ప్రతి ఆదివారం కూడా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవులు.