BOB Vacancy 2024: నిరుద్యోగులు అస్సలు మిస్‌ చేయకండి.. 7వ తరగతి పాసైతే బ్యాంక్‌ జాబ్

Thu, 01 Aug 2024-10:58 am,

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వాచ్‌మెన్‌, గార్డెనర్‌ పోస్టుల భర్తీ చేపడుదోంది.  ఈ సందర్భంగా 7 వ తరగతి పాసైన వారు ఈ పోస్టులకు అర్హత సాధించవచ్చు. బ్యాంక్‌ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్‌ www.bankofbaroda.in అధికారిక నోటిఫికేషన్‌ క్షుణ్నంగా పరిశీలించవచ్చు.   

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అప్లికేషన్‌ ప్రక్రియ కూడా మొదలైంది. 2024 ఆగస్టు 8 లోగా అప్లై చేసుకోవాలి. ఆగస్టు 8 సాయంత్రం 5 తర్వాత అప్లికేషన్‌ ప్రక్రియ ముగిసిపోతుంది. బ్యాంక్‌ ఆఫ్ బరోడా జాబ్‌ అప్లై చేయడానికి ఏడవ తరగతి పాసైతే చాలు. అయితే, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వ్యవసాయం లేదా గార్డెనింగ్‌ సంబంధిత రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి. నోటిఫికేషన్‌లో ఈ పోస్టులకు సంబంధిత వివరాలు ఉన్నాయి.  

అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో జనరల్‌ నాలెడ్జీ, కంప్యూటర్ సంబంధిత ప్రశ్నలు అడుగుతారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.  

బ్యాంక్‌ ఆఫ్ బరోడా విడుదల చేసిన  ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.6,000 వేతనం పొందుతారు. ఇతర అలొవెన్సులు కూడా ఉంటాయి. అయితే ఈ పోస్టులకు కాంట్రాక్ట్‌ ప్రతిపాదికన భర్తీ చేస్తారు. ఆ తర్వాత  కాంట్రాక్ట్‌ పీరియడ్‌ జోనల్‌ మేనేజర్‌ పొడిగిస్తారు.  

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు కేవలం ఆఫ్‌లైన్‌ ద్వారానే అప్లై చేసుకోవాలి. ఎడ్యుకేషనల్‌ క్వాలిఫికేషన్‌ ఇతర డాక్యుమెంట్లను కూడా పొందుపరచి అప్లికేషన్‌ను రిజినల్ ఆఫీస్‌ సవాయి మాధోపుర్‌ ఏరియా ఫస్ట్‌ ఫ్లోర్, వాస్తల్యా ఆసుపత్రి పైన 322201 పంపించాలి. మరిన్ని వివరాలుకు బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు ఉన్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link