Bathukamma 2024: మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ.. ప్రసాదం, ప్రత్యేకత ఏంటో తెలుసా?
బతుకమ్మ పండుగను రంగురంగుల పూలతో తయారు చేస్తారు. దీన్ని గోపురం ఆకారంలో పేర్చి దాని చుట్టూ వలయాకారంలో ఆటపాటలతో ఆడుకుంటారు. 9 రోజులపాటు నిర్వహించుకునే ఆ పండుగ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
కుటుంబ సభ్యులు సుకఃశాంతులు వర్ధిల్లాలని కోరుకుంటారు. అంతేకాదు ఈ బతుకమ్మకు ముందు బొడ్డెమ్మను కూడా తయారు చేస్తారు. పెద్ద బతుకమ్మ లేదా సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
ఈ సమయంలో పంటపొలాలు కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. రంగురంగుల పూలు పూస్తాయి. వాటన్నిటినీ తెచ్చి తెలంగాణలో అత్యంత వైభవోపేతంగా పూల పండుగను జరుపుకుంటారు ఆడపడుచులు..
ఊరూవాడా ఒక్కచోట చేరి పిల్లా పాపాలు అంతా కలిసి బతుకమ్మను ఆడుకుంటారు. బతుకమ్మ అంటే జీవించు తల్లి అని అర్థం. అయితే, మూడో రోజు జరుపుకొనే బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తారు.
గౌరమ్మను తయారు చేసి అమ్మను పూజించి ఆటపాటలు ఆడి దగ్గర్లోని చేరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత వాయినంగా సత్తుపిండి, చక్కెర, బెల్లం కలిపి ఇస్తారు. బతుకమ్మ పండుగ ఈ ఏడాది అక్టోబర్ 2న ప్రారంభమై 10వ తేదీ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఆ తర్వాత రెండు రోజులకే దసరా పండుగ జరుపుకుంటారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)