Bathukamma 2024: 5వ రోజు అట్ల బతుకమ్మ.. అలా ఎందుకు పిలుస్తారో తెలుసా?
తెలంగాణలో ఎంతో వేడుకగా జరుపుకొనే బతుకమ్మ పండుగ ఆశ్వీయుజ అమావాస్య కు ముందుగానే బొడ్డెమ్మతో ప్రారంభం అవుతంది. ఆ తర్వాత రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఊరువాడా అంతా కలిసి సాయంత్రం వేళ ఒక్కదగ్గరకు చేరి బతుకమ్మను ఆడుకుంటారు.
ఈ వేడుకను 9 రోజులపాటు నిర్వహిస్తారు. బతుకమ్మ పండుగ ఐదవ రోజు అట్ల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు వాయనంగా పిండితో తయారు చేసిన అట్లను ఇచ్చి పుచ్చుకునే ఆచారం ఉంది. అందుకే అట్ల బతుకమ్మ అని పేరు వచ్చింది.
9 రోజులపాటు నవ రాత్రుల్లో కొనసాగే ఈ బతుకమ్మ వేడుక తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. ప్రసాదంగా కూడా 9 రకాలు తయారు చేస్తారు. నందివర్ధనం, తంగేడు పూలు, గునుగుపూలు తెచ్చి గోపురం ఆకారంలో పూజిస్తారు.
బతుకమ్మలో వాడే ఈ పూలలో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ కాలంలో వానలు బాగా పడతాయి. ఆశ్వీయుజ అమావాస్యతో మొదలయ్యే సద్దుల బతుకమ్మను పెద్ద పెద్ద బతుకమ్మలుగా తయారు చేసి ఆడపడచులంతా కలసి ఆడుకుంటారు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)