MS Dhoni Farmhouse Pics: ఎంఎస్ ధోని విలాసవంతమైన ఫార్మ్‌హౌస్ ఎలా ఉందో చూశారా

Mon, 25 Apr 2022-2:18 pm,

ఈ ఫోటోలో ఎంఎస్ ధోని భార్య సాక్షిని చూడవచ్చు. ఈ ఇద్దరి ఫార్మ్‌హౌస్ ఏకంగా 7 ఎకరాల్లో ఉంది. 

ఎంఎస్ ధోని ఈ ఫార్మ్‌హోస్‌ను 2017లో నిర్మించుకున్నాడు. దీనికి కైలాస్‌పతి అని పేరు కూడా పెట్టాడు. ఎక్కువ సమయం ఇక్కడే గడుపుతుంటాడు. ఇక్కడ్నించే బైక్స్ లేదా కార్లు లేదా గుర్రాలు లేదా కుక్కల్ని తీసుకుని బయటకు వెళ్తుంటాడు.

ఎంఎస్ ధోని ఫార్మ్‌హౌస్‌లో ఉండాలనుకోవడానికి కారణం..అతనికి ప్రకృతి అన్నా...జంతువులన్నా ఇష్టం ఉండటమే. 

ఎంఎస్ ధోని ఫార్మ్‌హౌస్ చాలా విశాలంగా ఉంటుంది. ఆధునికంగా ఉంటుంది. చుట్టూ పచ్చని ల్యాండ్ స్కేప్‌తో ఆకర్షిస్తుంటుంది. 

ఎంఎస్ ధోని తనయ జివా రాంచీలోని ఈ ఫార్మ్‌హౌస్‌లో యోగా చేస్తూ పోజులిచ్చింది. నిజంగానే ఇక్కడి వాతావరణం యోగాకు అనుకూలంగా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది.

ఎంఎస్ ధోనికి అతిపెద్దదైన కార్ గ్యారేజ్ ఉంది. ఇందులో క్లాసిక్ మోడల్స్ హమ్మర్‌హెచ్ 2, జీఎంసీ సియేరా, మిట్‌సుబిషి ఫస్ట్ జనరేషన్ పాజ్రో, 2 డోర్ స్కార్పియో వంటి కార్లున్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link