Beautiful Athlete with Wild Bear: అడవి ఎలుగుబంటితో అందమైన ముద్దుగుమ్మ సావాసం, ఎందుకో తెలుసా
వెరోనికా, ఎలుగుబంటి కలయిక 2009లో జరిగింది. వెరోనికా ఓ సఫారీ పార్క్‌లో ఎలుగుబంటి ప్రాణం కాపాడింది. అప్పట్నించి ఇద్దరూ కలిసే జీవిస్తున్నారు. ఎక్కడికెళ్లినా ఎలుగుబంటి తోడు ఉండాల్సిందే.
వెరోనికా ..తన ఎలుగుబంటిని ఒక్క క్షణం కోసం కూడా విడిచి పెట్టదు. వెరోనికా, ఎలుగుబంటి ఇరువురూ కలిసి పడవలో నదిలో కూడా ప్రయాణిస్తుంటారు. ఈ ఇద్దరి మధ్య బంధం రానురానూ పటిష్టమవుతోంది.
వెరోనికా డిచ్కా..ఈ అడవి ఎలుగుబంటిని తన బెస్ట్ ఫ్రెండ్‌గా, ఓ కొడుకుగా చూసుకుంటుంది. ఎలుగుబంటి కూడా ఆమెను ఓ తల్లిలా భావిస్తుందని వెరోనికా చెబుతోంది. ఎప్పుడూ ఆమెతోనే ఉంటుంది.
వెరోనికా డిచ్కా ఎప్పుడూ ఈ అడవి ఎలుగుబంటిని కార్లో లాంగ్ డ్రైవ్‌కు కూడా తీసుకెళ్తుంటుంది. కార్లో పక్కన కూర్చోబెట్టుకుని వెళ్తున్న ఫోటోలు చాలా వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా ఎవరైనా సరే కుక్కల్ని లేదా పిల్లుల్ని లేదా చిలుకలు, పక్షుల్ని పెంచుకుంటుంటారు. ఇంకొందరైతే ఆవుల్ని, మేకల్ని పెంచుకుంటారు. కానీ రష్యాకు చెందిన వెరోనికా అనే ఈ అందమైన ముద్దుగుమ్మ కోరిక చాలా విచిత్రంగా ఉంది. ఈమె ఓ అడవి ఎలుగుబంటిని పెంచుకుంటోంది.