Vinesh Phogat: దేశం కన్నీరు.. 140 కోట్ల మంది గుండె ముక్కలు చేసిన ఆ 100 గ్రాములు..!

Wed, 07 Aug 2024-1:48 pm,

సెమీ ఫైనల్‌లో క్యూబా రెజ్లర్‌ యస్‌నెలిస్‌ గుజ్మన్‌పై విజయంతో వినేశ్ ఫొగాట్ ఫైనల్స్‌కు చేరింది. దీంతో ఫైనల్‌కు చేరిన తొలి మహిళా రెజ్లర్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది.   

నేడు ఫైనల్ పోరులో సారా హిల్డెబ్రాండ్‌తో తలపడాల్సి ఉంది. 50 కేజీల విభాగంలో నేడు రాత్రి ఫైనల్ మ్యాచ్ ఉండగా.. వినేశ్ ఫొగాట్ బరువును చెక్ చేశారు. ఆమె 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నట్లు నిర్వాహకులు గుర్తించారు.   

దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ.. ఒలింపిక్‌ కమిటీ, రెజ్లింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ ప్రజలంతా షాక్‌కు గురయ్యారు.  

50 కేజీల విభాగం నుంచి వినేశ్‌ ఫొగాట్ అనర్హత వేటు ఎదుర్కొవాల్సి వచ్చిందని‌ భారత ఒలింపిక్‌ సంఘం తెలిపింది. కేవలం కొన్ని గ్రాముల కారణంగా వెయిట్ పెరగడంతో వేటు పడిందని.. దయచేసి వినేశ్‌ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని కోరింది.   

వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేసేందుకు ఐవోఏ రెడీ అవుతోంది. మంగళవారం రాత్రి సెమీ ఫైనల్‌లో తలపడిన వినేశ్.. బుధవారం ఉదయానికి బరువు పెరగడంపై అనుమానం వ్యక్తం చేసింది.   

అనర్హత వేటు నిర్ణయాన్ని సమీక్షించాలని డిమాండ్ చేస్తోంది. వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటుపై పునఃసమీక్షంచకపోతే ఆమె ఖాళీ చేతులతో భారత్‌కు తిరిగి రావాల్సి ఉంటుంది.   

బరువు తగ్గేందుకు వినేశ్ ఫొగాట్ రాత్రి అంతా తీవ్రంగా సాధన చేసింది. రాత్రంతా కఠోర సాధన చేసినా.. 100 గ్రాముల బరువు ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే ఆమె అస్వస్థతకు గురైంది. డీహైడ్రేషన్ కారణంగా ఆస్పత్రిలో చేరింది.     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link