Cucumber Benefits: సమ్మర్‌లో కీరదోస తింటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం
తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. ఎండల కారణంగా అప్పుడే వడగాలు వీస్తున్నాయి. మధ్యాహ్నం వేళ బయట తిరగడం అంత మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళాలనుకునేవారు గొడుగు తీసుకుని బటయకు వెళ్లడం ఉత్తమం. వేసవిలో మీ ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలలో కీరదోస ఒకటి. కీరదోసలో విటమిన్ కె, విటమిన్ ఏ, విటమిన్ సి లభిస్తుంది. కీరదోసను జూస్ చేసుకుని తాగినా ప్రయోజనం ఉంటుంది.
Also Read: COVID-19 Vaccine: కేంద్రం కీలక నిర్ణయం, 45 పైబడిన వారికి ఏప్రిల్ 1 నుంచి కరోనా టీకాలు
కీరదోస తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. దానివల్ల ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలుగుతుంది.
ప్రతిరోజూ కొన్ని కీరదోస ముక్కల్ని తినడం వల్ల, లేదా కీరదోస జూస్ తాగితే కొంతమేర బరువు తగ్గించడంతో దోహదం చేస్తుంది.
Also Read: Benefits Of Neem Leaves: రుచిలో చేదు, ఆరోగ్య ప్రయోజనాలలో రారాజు వేప, జూస్ తాగితే మరెన్నో లాభాలు
రోగనిరోధక శక్తిని విటమిన్ సి(Vitamin C) పెంచుతుంది. కీరదోస తీసుకోవడం వల్ల మీకు విటమిన్ సి లభిస్తుంది. దీనిలో ఉంటే నీటిశాతం మిమ్మల్ని డీహైడ్రేట్ అవకుండా నియంత్రిస్తుంది.
రోజూ రాత్రి పడుకునే ముందు కొన్ని కీరదోస ముక్కలు తినడంవల్ల తలనొప్పి తగ్గుతుంది. కీరదోస ముక్కలను కళ్లమీద పెట్టుకుంటే కంటికి చల్లదనాన్ని ఇచ్చి వేడిమి తగ్గిస్తుంది. కళ్ల కింద ఉండే నల్లని వలయాలను దూరం చేస్తుంది.
Also Read: Benefits Of Kiwi Fruit: కివి పండు తింటే రక్తం గడ్డకట్టదు, మరెన్నో ప్రయోజనాలు మీకు తెలుసా