Benefits Of Neem Leaves: రుచిలో చేదు, ఆరోగ్య ప్రయోజనాలలో రారాజు వేప, జూస్ తాగితే మరెన్నో లాభాలు

Health Benefits Of Neem Leaves: ప్రాచీన కాలం నుంచి దీన్ని ఔషధాలలో వినియోగిస్తున్నారు. వేప ఆకులు, పువ్వులు, విత్తనాలు, పండ్లు, వేర్లు మరియు బెరడు.. అన్నింటిని వ్యాధి చికిత్సలో వినియోగిస్తారు. వేప చెట్టును ‘21 వ శతాబ్దపు చెట్టు’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 

Written by - Shankar Dukanam | Last Updated : Mar 21, 2021, 05:19 PM IST
  • ప్రాచీన కాలం నుంచి దీన్ని ఔషధాలలో వినియోగిస్తున్నారు
  • వేప ఆకులు తినడం వల్ల మీ శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు
  • వేప రసం తాగితే ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. వేప ఆకుల కొన్ని ప్రయోజనాలు
Benefits Of Neem Leaves: రుచిలో చేదు, ఆరోగ్య ప్రయోజనాలలో రారాజు వేప, జూస్ తాగితే మరెన్నో లాభాలు

Benefits Of Neem Leaves: ఎన్నో ఔషధ గుణాలను తనలో ఇముడ్చుకుంది వేప చెట్టు. ప్రాచీన కాలం నుంచి దీన్ని ఔషధాలలో వినియోగిస్తున్నారు. వేప ఆకులు, పువ్వులు, విత్తనాలు, పండ్లు, వేర్లు మరియు బెరడు.. అన్నింటిని వ్యాధి చికిత్సలో వినియోగిస్తారు. వేప చెట్టును ‘21 వ శతాబ్దపు చెట్టు’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 

రోజూ తాజా వేప ఆకులు తినడం వల్ల మీ శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఇనుము, కాల్షియం మరియు ఫైబర్ వంటివి లభిస్తాయి. వాస్తవానికి వేప ఆకులను పరగడుపున తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. వేప రసం తాగితే ఇన్‌ఫెక్షన్ల నుంచి మీ శరీరాన్ని రక్షిస్తుంది. వేప ఆకుల కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు (Health Tips) ఇక్కడ తెలుసుకుందాం.

Also Read: Benefits Of Kiwi Fruit: కివి పండు తింటే రక్తం గడ్డకట్టదు, మరెన్నో ప్రయోజనాలు మీకు తెలుసా

వేప ఆకులు యాంటీ ఫంగల్ లక్షణాలను (Antifungal Properties) కలిగి ఉంటాయి. ఫంగస్ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తుంది. అస్పెర్‌గిల్లస్, కాండిడా అల్బికాన్స్ మరియు మైక్రోస్పోరం జిప్సం వంటి శిలీంధ్ర వ్యాధి కారకాలపై వేప ఆకులతో తయారు చేసిన ఇథనాల్, సజల మరియు ఇథైల్ విశ్రమం పని చేస్తుంది. 

పరగడుపున (Empty Stomach)తో వేప ఆకులు తినడం వల్ల ఇ.కోలి, సాల్మానెల్లా, మరియు క్లెబ్సిఎల్లా వంటి హానికారిక బ్యాక్టీరియాతో పోరాడేందుకు రోగనిరోధక శక్తిని అందిస్తుంది. 

వేప ఆకులు రక్తాన్ని శుద్ధిచేస్తాయి. రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. ఖాళీ కడుపు(పరగడుపు)తో వేప ఆకులు తినడం వల్ల రక్తంలోని విషపూరిత పదార్థాలను, మలినాలను తొలగిస్తుంది. మరియు కొన్ని రకాల క్యాన్సర్ బారిన పడకుండా చేస్తుంది. 

Also Read: Vastu Tips: రాత్రివేళ హాయిగా నిద్రించాలంటే Pillow కింద ఉంచాల్సిన వస్తువులు ఇవే 

వేప ఆకులు తినడం వల్ల డయాబెటిస్ (Diabetes) ఉన్నవారికి ప్రయోజనం చేకూరుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని వేప ఆకులు తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. తరచుగా వేప ఆకులు తినడం, లేక వేప రసం తాగేవారిలో షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు తక్కువ.

వేప ఆకులు చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మాన్ని హానికారక క్రిముల నుంచి కాపాడటంతో పాటు కొత్తగా జీవకాంతిని నింపుతుంది. సోరియాసిస్, తామర, మొటిమలు వంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధుల చికిత్సలో వేప ఆకులను వాడతారు.

గమనిక: మీరు ఈ ఆరోగ్య చిట్కాలు పాటించాలని భావిస్తే ముందుగా వైద్యుడ్ని సంప్రదించాలి. వారి సలహా మేరకు మీరు ఆరోగ్య చిట్కాలు పాటిస్తే ఏ ఆరోగ్య సమస్య, ఇతరత్రా ఇబ్బందులు ఉండవు. 

Also Read: Benefits of Drinking Milk: పాలు తాగితే మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సహా పలు సమస్యలు దూరం అవుతాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News