Sleeping Time: రాత్రి ఈ సమయానికి నిద్రిస్తే..ఎన్ని ప్రయోజనాలో..నిద్రించేందుకు బెస్ట్ టైమ్ ఇదే..!!
Benefits of sleep: రోజంతా పనిచేసి అలసిపోయిన శరీరానికి కాస్తంత రెస్ట్ ఇవ్వడం చాలా అవసరం. మన శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలము. కాబట్టి శరీరానికి కూడా రెస్ట్ ఇవ్వాలి. ముఖ్యంగా మనకు నిద్ర చాలా అవసరం. పని, కుటుంబ బాధ్యతలు వంటి పలు కారణాల వల్ల నిద్ర సమయం మారుతూ ఉంటుంది.
సరైన సమయానికి భోజనం చేయడం, నిద్రించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. త్వరగా నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదే సమయంలో, నిద్ర లేకపోవడం వల్ల డిప్రెషన్, గుండె జబ్బులు వంటి వివిధ ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య నిద్రపోవడం వల్ల గుండె, గుండె సంబంధిత వ్యాధుల ముప్పు చాలా వరకు తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది.
ప్రతిరోజూ త్వరగా పడుకోవడం అలవాటు చేసుకుంటే.. మరుసటి రోజంతా హుషారుగా ఉంటాము. అదే సమయంలో, శరీరంలోని హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి.
రాత్రి త్వరగా నిద్రపోవడం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి లభించడంతోపాటుగా...శరీరంలో రోగనిరోధక వ్యవస్థ కూడా మెరుగ్గా ఉంటుంది.
పిల్లలు రాత్రి త్వరగా నిద్రపోతే మరుసటి రోజు హుషారుగా పాఠశాలకు వెళ్తారు. లేదంటే ఉదయం నిద్రలేవడానికి పాఠశాలకు వెళ్లనంటూ మారం చేస్తుంటారు.