Viral Infections: ఈ 4 మసాలా వస్తువులతో వైరల్ ఇన్‌ఫెక్షన్లకు చెక్
మిరియాలు
మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ సి, ఫ్లెవనాయిడ్స్ కూడా ఉంటాయి. ఇమ్యూనిటీ పటిష్టం చేసేందుకు దోహదపడుతుంది. ఇందులో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క అద్భుతమైన మసాలా ఔషధం. వైరల్ ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పోలీఫెనోల్స్, ప్రో ఏంథో సైనిడిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచుతాయి.
వాము
సాధారణంగా వామును వంటల్లో ఉపయోగిస్తుంటారు. కడుపు నొప్పి ఉన్నప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది. జలుబు, దగ్గు సమస్యల్నించి గట్టెక్కేందుకు వాము ఉపయోగిస్తారు. ఇందులో ఉండే థైమోల్ అనే కెమికల్ ఇందుకు ఉపయోగపడుతుంది.
మిరియాలు
మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ సి, ఫ్లెవనాయిడ్స్ కూడా ఉంటాయి. ఇమ్యూనిటీ పటిష్టం చేసేందుకు దోహదపడుతుంది. ఇందులో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి.
అల్లం
అల్లం అనేది చాలా వ్యాధుల్నించి రక్షిస్తుంది. చాలా మంది అందుకే అల్లం టీ తాగుతుంటారు. అల్లం అనేది శరీరాన్ని అంతర్గతంగా పటిష్టం చేస్తుంది. వివిధ రకాల వ్యాధుల్నించి రక్షిస్తుంది.