Exercises for Weight Loss: బెల్లీ ఫ్యాట్, స్థూలకాయం నెలరోజుల్లో తగ్గించే 5 వ్యాయామ పద్ధతులు

Tue, 18 Jun 2024-9:06 pm,

ప్లాంక్

గోడ ముందు నిలుచుని ఎడమ చేతి మోచేయిని గోడకు నిటారుగా ఆన్చి మీరు ఏటవాలుగా ఉండేట్టు నిలుచోవాలి. ఇలా పొజీషన్ మార్చుతూ చేయాలి.

లాంజెస్

గోడ ముందు నిలుచుని ఓ కాలిని ముందుకు పెట్టాలి. మరో కాలి మోకాలుపై కూర్చోవాలి. రెండో కాలు పైకి ఉండాలి. తరువాత కాలు పొజీషన్ అటూ ఇటూ మార్చాలి. ఇలా 10 సార్లు చేయాలి.

పుష్ అప్స్

గోడకు కొద్దిగా దూరంలో అబిముఖంగా నిలుచుని చేతుల్ని గోడకు ఆన్చాలి. నెమ్మది నెమ్మదిగా ఏటవాలు పొజీషన్‌లో పుష్ అప్స్ తీయాలి. ఇలా 10-15 సార్లు చేయాలి

మౌంటెన్ క్లైంబర్

గోడకు అభిముఖంగా నిలుచిని చేతులు గోడకు ఆన్చాలి. మీ శరీరాన్ని నిటారుగా ఉంచాలి. కడుపు లోపలకు లాగాలి. ఓ మోకాలుని ఛాతీ వరకూ లాగాలి. తరువాత రెండో కాలిని ఇలా చేయాలి. ఇలా ప్రతి సెట్ 30 సెకన్ల పాటు 10-15 సెట్స్ చేయాలి,.

స్కార్టస్

గోడ ముందు నిలుచుని మీ భుజాల వెడల్పులో కాళ్లను చాచి పెట్టుకోవాలి. ఇప్పుడు గోడ కుర్చీ వేసినట్టు కూర్చోవాలి. తిరిగి నిటారుగా నిలుచోవాలి. ఇలా  15 సార్లు చేయాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link