Laptop Battery Saving Tricks: మీ ల్యాప్‌టాప్ ఛార్జింగ్ త్వరగా డ్రైన్ అవుతోందా, ఇలా చేయండి చాలు
స్లీప్, హైబర్‌నెట్ సెట్టింగ్ మార్పు
ల్యాప్‌ట్యాప్ తక్కువ సమయానికి ఇనాక్టివ్ చేసేందుకు స్లీప్ లేదా హైబర్‌నెట్ సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల బ్యాటరీ సేవ్ అవుతుంది. స్లీప్ టైమ్ తగ్గించడం ద్వారా బ్యాటరీ సేవ్ చేయవచ్చు.
వైఫై, బ్లూటూత్ క్లోజ్ చేయడం
వైఫై, బ్లూ టూత్ ఆన్‌లో ఉంటే ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా ఖర్చవుతుంది. అందుకే అవసరం లేనప్పుడు వైఫై, బ్లూటూత్ రెండూ క్లోజ్ చేయాలి
బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ క్లోజ్ చేయడం
మనకు తెలియకుండా చాలా యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తుంటాయి. ఇవి బ్యాటరీని ఖర్చు చేస్తుంటాయి. వీటిని క్లోజ్ చేయడం ద్వారా బ్యాటరీ సేవ్ చేయవచ్చు. దీనికోసం టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసి బ్యాక్‌గ్రౌండ్ ప్రోసెస్ ట్యాబ్‌లో వెళ్లాలి. ఇప్పుడు అక్కడ కన్పించే యాప్స్ క్లోజ్ చేసుకోవాలి.
బ్యాటరీ సేవ్ మోడ్
ల్యాప్‌టాప్‌లో బ్యాటరీ సేవ్ మోడ్ ఉంటుంది. ఇది బ్యాటరీ డ్రెయిన్ అవడాన్ని తగ్గిస్తుంది. సెట్టింగ్స్‌లో వెళ్లి సిస్టమ్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు పవర్ ఎండ్ స్లీప్‌కు వెళ్లి బ్యాటరీ సేవ్ మోడ్ ఆన్ చేసుకోవాలి.
స్క్రీన్ బ్లైట్‌నెస్ తగ్గించడం
ల్యాప్‌టాప్ బ్యాటరీ సేవ్ చేసే మొదటి పద్ధతి స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించడం. స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎంత ఎక్కువగా ఉంటే బ్యాటరీ అంత త్వరగా అయిపోతుంటుంది. స్క్రీన్ బ్లైట్‌నెస్ తగ్గించడం ద్వారా బ్యాటరీ లైఫ్ పెంచవచ్చు.