Best Health, Fitness Apps: ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కి పనికొచ్చే బెస్ట్ యాప్స్ ఇవే..!
బరువు తగ్గడంలో మీకు సహాయపడే ఉత్తమమైన ఫిట్‌నెస్ యాప్‌లలో క్యాలరీ కౌంటర్ మైఫిట్‌నెస్ పాల్ ఒకటి. మీరు ఏమి తినాలి, ఏమి తినకూడదు అనే దాని గురించి కూడా మీకు ఈ యాప్ మార్గనిర్దేశం చేస్తుంది.
మీ ఆరోగ్యం, ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకోవడంలో హెల్తీపైమీ యాప్ మీకు సహాయపడుతుంది. హెల్తీపైమీ..వర్కౌట్ ట్రాకర్, వెయిట్ లాస్ ట్రాకర్, వాటర్ ట్రాకర్, ఫుడ్ ట్రాకర్, స్లీప్ ట్రాకర్, హ్యాండ్‌వాష్ ట్రాకర్‌ను సులభతరం చేస్తుంది.
జెఫిట్ వర్కౌట్ ట్రాకర్.. ఇది ఫిట్‌నెస్ ట్రాకర్ యాప్ మాత్రమే కాదు జిమ్ ట్రైనర్ కూడా. వినియోగదారులు చురుకుగా ఉండటానికి సహాయపడే ఉచిత ఫిట్‌నెస్ ప్లాన్ ఇందులో ఉంటుంది. ఇందులో 1300 వివరణాత్మక వ్యాయామాలు కూడా ఉన్నాయి.
నిత్యం యోగా చేసే వారు డైలీ యోగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే మంచిది. దీని ద్వారా రోజువారీ చిట్కాలు, వేరియేషన్‌లను పొందవచ్చు. అంతేకాకుండా ఈ యాప్‌లో వాయిస్ క్లిప్ ఉంటుంది. అది వినియోగదారుని దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది.
గూగుల్ ఫిట్ అనేది వర్కౌట్ ట్రాకర్ యాప్. ఇది వినియోగదారులకు వేగం, ఎత్తు, మార్గం, నడక, పరుగు మరియు ఇతర కార్యకలాపాలను సూచిస్తుంది. ఇందులో మీరు ఎన్ని కేలరీలు కరిగించారన్నది తెలియజేస్తుంది.