Detox Drinks For Lungs: ఈ డ్రింక్ తాగితే ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన మలినాలను శుభ్రం!!
నేటికాలంలో ధూమపానం చాలా సాధారణమైపోయింది. పెద్దలు మాత్రమే కాదు, చిన్న పిల్లలు కూడా ధూమపానం చేయడం కనిపిస్తోంది. ఇది చాలా ఆందోళనకర విషయం.
ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణవుతుందని వైద్యులు చెబుతున్నప్పటికి చాలా మంది ఈ అలవాటును మానుకోవడం లేదు. దీని వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
అతిగా ధూమపానం చేయడం వల్ల దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్‌లు వస్తాయి.
అయితే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం మన మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇంట్లోనే కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా మనం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
దీని కోసం మీరు నిమ్మకాయ, దాల్చిన చెక్క పొడి, తేనె, కాయన్ పెప్పర్ పదార్థాలు ఉండాలి. వీటిని ఉపయోంచి డ్రింక్ తయారు చేసుకోవాలి.
ముందుగా ఒక గ్లాస్‌లో నీరు పోసి పైన చెప్పిన పొడిలను కలుపుకోవాలి. దీని ప్రతిరోజు రాత్రి తాగడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
ఈ డ్రింక్‌తో ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన మలినాలను తొలగించుకోవచ్చు. శ్వాస సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.