Best New Ev Suv 2024: వావ్..ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 635 కి.మీ ప్రయాణిస్తుంది..35 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్!
ఈ బిఎమ్‌డబ్యూ ఐఎక్స్ ఎక్స్‌డ్రైవ్ 50 (BMW iX xDrive 50) కారు 523 హార్స్‌పవర్, 765 ఎన్‌ఎమ్ టార్క్‌తో డ్యూయల్ మోటార్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 0 నుంచి 100 కి.మీకు 4.6 సెకన్లలో చేరుకోగలదు.
బిఎమ్‌డబ్యూ ఐఎక్స్ ఎక్స్‌డ్రైవ్ 50 SUV కారు 111.5 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 630 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.
ఈ కారు క్లాసిక్ బిఎమ్‌డబ్యూ కిడ్నీ గ్రిల్‌తో ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది. అంతేకాకుండా ADAS ఫీచర్లతో అధునాతన భద్రతను కలిగి ఉంటుంది.
5 స్క్రీన్‌లతో హై-టెక్ ఇంటీరియర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 14.9 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉంటాయి.
ఈ స్మార్ట్ కారు స్పోర్టీ డ్రైవింగ్ అనుభవం కోసం ట్యూన్ చేసిన సస్పెన్షన్‌తో పాటు స్టీరింగ్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఇది 200 kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.
ఇది పాన్‌రోమిక్ సన్‌రూఫ్, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా హీటెడ్, వెంటిలేటెడ్ సీట్‌లతో లభిస్తోంది. దీంతో పాటు ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్, స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ వంచి అనేక స్మార్ట్ ఫీచర్స్ లభిస్తాయి.