Best Tollywood Patriotic movies: ఆర్ఆర్ఆర్ సహా తెలుగు తెరపై దేశభక్తిని రగిల్చిన చిత్రాలు..
అల్లూరి సీతారామరాజు :
తెలుగు తెరపై టాకీల ప్రారంభంలోనే మాలపిల్ల, వందేమాతరం, మన దేశం వంటి దేశ భక్తి చిత్రాలొచ్చాయి. ఆ తర్వాత తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా తెలుగులో గొప్ప దేశభక్తి చిత్రాల్లో మొదటి వరసలో ఉంటుంది. ఈ సినిమా తెలుగు బెస్ట్ పేట్రియాటిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.
తాండ్ర పాపారాయుడు : రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తాండ్ర పాపారాయుడు’. బొబ్బలి సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించిన బ్రిటిష్ వారిపై తిరగబడ్డ స్వాతంత్య్ర సమరయోధుడు తాండ్ర పాపారాయుడు. ఈ సినిమా మంచి విజయమే సాధించింది.
సర్ధార్ పాపారాయుడు : తెలుగులో ఎన్టీఆర్ హీరోగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్ధార్ పాపారాయుడు’. ఈ చిత్రాన్ని సర్ధార్ సర్వాయి పాపన్న జీవితాన్ని బేస్ చేసుకొని కొంత కమర్షియలాలిటి జోడించి ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తెలుగులో వచ్చిన మంచి దేశభక్తి చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది.
ఖడ్గం : కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగులో వచ్చిన ఉత్తమ దేశ భక్తి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
సైరా నరసింహారెడ్డి : మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కని చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మన దేశంలో తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో వచ్చిన దేశభక్తి చిత్రాల్లో స్థానం సంపాదించుకుంది.
ఆర్ఆర్ఆర్: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్ హీరోలుగా నటించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’(రౌద్రం రణం రుధిరం). తెలుగులో వచ్చిన బెస్ట్ దేశభక్తి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ సినిమాను రాజమౌళి చరిత్రను వక్రీకరించి అల్లూరిని బ్రిటిష్ వారి దగ్గర పనిచేసిన వ్యక్తిగా చూపించడం.. కొమరం భీమ్ పాత్ర బ్రిటిష్ అమ్మాయితో ప్రేమలో పడటం వంటి అంశాలపై వివాదం చెలరేగినా.. ఓవరాల్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మేజర్: అడివి శేష్ హీరోగా నటించిన ‘మేజర్’ చిత్రం తెలుగులో వచ్చిన బెస్ట్ దేశభక్తి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. శశికిరణ్ తిక్కా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
దేశభక్తి చిత్రాలు.. వీటితో పాటు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘భారతీయుడు’తో పాటు వెంకటేష్ హీరోగా నటించిన సుభాష్ చంద్రబోస్, బాలయ్య నటించిన ‘ఒక్క మగాడు’, శ్రీహరి హీరోగా నటించిన ‘హనుమంతు’, విజయరంగరాజుతో పాటు ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ సహా తెలుగులో పలు దేశ భక్తి చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి.