Best Tourist Places Near Hyderabad: హైదరాబాద్ దగ్గర్లో ఒక్కరోజులోనే చూసొచ్చే అద్భుతమైన ప్రదేశాలు ఇవే..క్రిస్మస్ సెలవుల్లో తప్పక వెళ్లండి

Thu, 19 Dec 2024-3:00 pm,

Best Tourist Places Near Hyderabad: పనిచేస్తున్న ఒత్తిడి, ఇంట్లో ఆర్థిక కష్టాలు, కుటుంబ బాధ్యతలు..వీటన్నింటిని బ్యాలెన్స్  చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకురావడం అనేది ఎంతో సవాల్ తో కూడుకున్నదే. కాబట్టి వీటన్నింటి నుంచి బయటపడాలంటే వెకేషన్ బెస్ట్ ఆప్షన్. మంచి రిలీఫ్ కావాలంటే వెకేషన్ వెళ్లాలి. ఇప్పుడున్న రోజుల్లో రోజుల తరబడి టూర్ వెళ్లేందుకు కాస్త కష్టమైన పనే అని  చెప్పవచ్చు. అందుకే హైదరాబాద్ నుంచి ఒక్కరోజులోనే తిరిగి వచ్చే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. నచ్చిన ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేసి రావచ్చు. అవేంటో చూద్దాం.   

నర్సాపూర్ ఫారెస్ట్:  హైదరాబాద్ కుక సమీపంలో ఉన్న ప్రకృతి కేంద్రం నర్సాపూర్ ఫారెస్ట్. దట్టమైన అడవి, రకరకాల జంతువులు, పక్షులతో ఎంతో రమణీయంగా ఉంటుంది. మధ్యలో ఉండే సరస్సు నర్సాపూర్ అడవుల అందాలను మరింత పెంచుతుంది. ఈ అడవిలో ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు.   

ఏడుపాయల ఆలయం : నర్సాపూర్ ఫారెస్ట్ నుంచి ముందుకు వెళ్తే ఏడుపాయల ఆలయం వస్తుంది. మెదక్ పట్టణానికి దగ్గరగా ఉంటుంది. మంజీర నదిపై ఈ ఆధ్యాత్మిక కేంద్రం ఉంటుంది. వనదుర్గ కొలువై ఉంటుంది. మంజీర నది ఏడుపాయలుగా విడిపోయే చోట అమ్మవారు వెలిసారు. ప్రకృతి అందాలకు కొదువే  ఉండదు. స్నేహితులతో, కుటుంబసభ్యులతో కలిసి వెళ్లేందుకు ఫర్పెక్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు.   

సింగూర్ డ్యామ్: హైదరాబాద్ నుంచి వెళ్తుంటే మొదట నర్సాపూర్ ఫారెస్ట్, తర్వాత ఏడుపాయల వనదుర్గ, తర్వాత సింగూర్ డ్యామ్ వస్తుంది. ఇది హైదరాబాద్ కు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంజీరానదిపై నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తికోసం నిర్మించారు. వర్షాకాలంలో నీటితో నిండి ఉంటుంది. దీని చుట్టుపక్కల పరిసరాలు ఎంతో రమణీయంగా ఉంటాయి. ప్రకృతి ప్రేమికులు సింగర్ డ్యామ్ వెకేషన్ ను బాగా ఎంజాయ్ చేస్తారు.   

మెదక్ ఖిల్లా కోట:  మెతుకు సీమ మెదక్ జిల్లా చరిత్ర గల పట్టణం. నిజాం పరిపాలనలో కట్టించినటువంటి ఖిల్లా ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉంది. ఈ ఖిల్లాపైకి ఎక్కి చూస్తే నిజాం కాలం నాటి సొరంగ మార్గాలు కనిపిస్తాయి.   

మెదక్ చర్చి :  ఆసియా ఖండంలోనే అత్యంత పురాతనమైన చర్చి మెదక్ లో ఉంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ  విదేశాల నుంచి సందర్శకులు ఇక్కడి వస్తుంటారు. మీరు కూడా ఓసారి సందర్శించండి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link