SBI Annuity Scheme: ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయండి, ప్రతినెలా SBI మీకు ఆదాయాన్ని అందిస్తుంది

Tue, 09 Mar 2021-10:54 am,

ఉద్యోగాల కన్నా ఏదైనా మార్గంలో పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదిస్తూనే బతుకు బండి ముందుకు సాగుతుందని సామాన్యులు కూడా భావిస్తున్నారు. కానీ కొన్నిసార్లు గ్యారంటీ లేని కంపెనీలు, సంస్థల్లో పెట్టుబడి పెట్టడం వల్ల వారి సమస్య పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఏ సమస్యను ఎదుర్కోకుండా సరైన చోట పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. ఇలాంటి వారికి అత్యుత్తమ మార్గం ఎస్‌బీఐ యాన్యుటీ ప్లాన్‌ (SBI Annuity Scheme)ను ఎంచుకోవడం అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఈ పథకం పేరు యాన్యుటీ స్కీమ్ (SBI Annuity Scheme) లేదా యాన్యుటీ స్కీమ్. ఇందులో మీరు 36, 60, 84 లేదా 120 నెలలు పెట్టుబడి పెట్టవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌(Fixed deposit)కు పొందే వడ్డీ రేటు మీకు లభిస్తుంది. ఒకవేళ మీరు అయిదేళ్ల కాలవ్యవధికి సంబంధించి పెట్టుబడి పెడితే.. మీరు ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌(Fixed deposit)కు వర్తించే వడ్డీ రేటును ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్ ద్వారా పొందుతారు.

1- యాన్యుటీ ప్లాన్‌లో పెట్టుబడులు SBI అన్ని శాఖలలో చేయవచ్చు.   2 - యాన్యుటీ పథకంలో చేరాలంటే కనీసం 25 వేల రూపాయల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 3 - SBI ఉద్యోగులు మరియు మాజీ ఉద్యోగులు 1 శాతం అధిక వడ్డీని పొందుతారు.  4 - సీనియర్ సిటిజన్లకు 0.5 శాతం అధిక వడ్డీని అందిస్తోంది ఎస్‌బీఐ.  5 - పథకానికి డిపాజిట్ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.  6 - డిపాజిట్ చేసిన మరుసటి నెలలో యాన్యుటీ చెల్లిస్తారు 7 - పెద్ద మొత్తంలో నగదు పొందేందుకు రాబడిని పొందడానికి ఇది ఉత్తమ పథకం.  8 - ప్రత్యేక సందర్భాలలో యాన్యుటీ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు ఓవర్‌డ్రాఫ్ట్ / రుణాలు పొందవచ్చు.  9 - పొదుపు ఖాతా యాన్యుటీ ప్లాన్‌పై లాభాలను అందిస్తుంది.

State Bank of India ఒక పెట్టుబడిదారుడు ప్రతి నెలా 10,000 రూపాయల ఆదాయాన్ని కోరుకుంటే, పెట్టుబడిదారుడు 5 లక్షలు 7 వేల 965 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. జమ చేసిన మొత్తంపై మీకు 7 శాతం వడ్డీ రేటుతో ప్రయోజనాలు అందుతాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. 

మధ్యతరగతి ప్రజలు పెరిగే ధరలతో సతమతమవుతుంటారు. కనుక వారు ఏదైనా పెట్టుబడి పథకాలలో ఇన్వెస్ట్ చేసి నెలవారీగా ఆదాయం పొందితే బతుకు బండిని లాగేందుకు తోడ్పడుతుంది. రికరింగ్ డిపాజిట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్ ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆర్డీలో అయితే ఒక చిన్న పొదుపు ద్వారా సేకరించి, దానిపై వడ్డీతో పెట్టుబడిదారుడికి తిరిగి ఇస్తారు. ఈ కారణంగా యాన్యుటీ ప్లాన్‌(SBI Annuity Scheme)తో పోలిస్తే ఖాతాదారులు ఆర్‌డీలో డిపాజిట్ చేసేందుకు ఇష్టపడతారని ఆర్థిక నిపుణులు చెబుతారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link