Bhagyashri Borse: అడుగుపెట్టగానే కెరీర్ కి శుభం కార్డు.. కేవలం ఒక్క కారణంతో..!

Tue, 27 Aug 2024-1:03 pm,

నిన్న మొన్నటిదాకా టాలీవుడ్ లో.. భాగ్యశ్రీ బోర్సే పేరు తెగ వినిపించింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో.. ప్రేక్షకుల ముందుకి వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాతో ఈమె తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. కాగా ఈ సినిమా విడుదల అవ్వక ముందు నుంచి.. ఈమె మీద మంచి బజ్ ఏర్పడింది.  కానీ సినిమా విడుదల అయ్యాక.. పరిస్థితులు తారు మరయ్యాయి. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. నిజానికి భాగ్యశ్రీ తన కెరీర్ ని చాలా ప్లాన్డ్ గా మొదలుపెట్టింది అని చెప్పుకోవాలి. సినిమా విడుదలకి..ముందు వరకు ఆమె టీం ఆమె గురించి సోషల్ మీడియాలో తెగ ప్రమోట్ చేశారు. 

రష్మిక కి నేషనల్ క్రష్, నయనతార కి లేడీ సూపర్ స్టార్ వంటి ట్యాగ్స్ లాగా.. ఈమెకు ఏకంగా మాస్ మహారాణి అంటూ టైటిల్ జోడించి మరి.. ఆమె గురించి ప్రచారం చేశారు. అయితే వాళ్ల పప్పులు ఏమీ ఉడకలేదు. హీరోయిన్ లో నిజంగా టాలెంట్ ఉంటేనే.స లేకపోతే సినిమా బాగుంటేనే.. ఎవరికైనా స్టార్ స్టేటస్ వస్తుంది అని.. మరోసారి ఈయన విషయంలో రుజువయింది. 

మొత్తానికి ఎన్ని చేసినా సినిమా మాత్రం డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇలాంటి పెయిడ్ ప్రమోషన్ల ద్వారా ఆమెకి గానీ.. ఆమె సినిమాకి గాని వచ్చిన లాభం ఏమి లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె చేతుల్లో ఒకే ఒక్క సినిమా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతం తిననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం.. ఆమె పాత్ర షూటింగ్ కోసం దర్శక నిర్మాతలు కేవలం 12 రోజులు.. మాత్రమే డేట్స్ తీసుకున్నారట. 

పది రోజుల్లో పూర్తయిపోయే షూటింగ్ అంటే ఈ సినిమాలో.. ఆమెకి పెద్ద చెప్పుకోదగ్గ పాత్ర లేదని అనుకోవచ్చు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న కాంత సినిమాకి కూడా.. ఈమె సైన్ చేసి దాదాపు ఒకటిన్నర సంవత్సరం దాటింది. సినిమా ఎప్పుడు మొదలవుతుందో కూడా క్లారిటీ లేదు. మరోవైపు రష్మిక మందన్నని ఫ్రాడ్ చేసిన.. మేనేజర్ ఈమెకు కూడా పనిచేస్తున్నారు అని వెనకరే. ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఇంకా అతనే భాగ్యశ్రీ మేనేజర్ గా పనిచేస్తున్నారట. ఎంత టాలెంట్ ఉన్నా కూడా.. అలాంటి ఫ్రాడ్ మేనేజర్లతో ఇండస్ట్రీలో నెట్టుకు రావడం.. కష్టమైన విషయం.

మరి ఈమె ఇప్పటికైనా కళ్లు తెరిచి కెరియర్ విషయంలో.. జాగ్రత్తలు తీసుకుంటుందో లేక.. పూర్తిగా మొదలవకముందే ఈమె కెరియర్ ఫేడ్ అవుట్ అయిపోతుందో వేచి చూడాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link