Petrol Price: బిగ్ బిగ్ గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Thu, 26 Sep 2024-10:05 pm,

భారత్ లో అధికం: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ధరలు పడిపోతున్నా దేశంలో మాత్రం నిలకడగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లోనే అత్యధిక పెట్రోల్, డీజిల్‌‌ ధర ఉంది.

క్షీణిస్తున్న ధరలు: అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు క్షీణిస్తుండడంతో త్వరలో దేశంలో ధరలు తగ్గనున్నాయని సమాచారం.

ముడి చమురు: ఒక బ్యారెల్‌ చమురు ధర 80 డాలర్ల నుంచి 70 డాలర్లకు పడిపోయింది. అక్కడ ధరలు తగ్గడంతో భారత్‌లో కూడా ధరలు తగ్గనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

పండుగ కానుక: దసరా, దీపావళి ముందు లీటర్‌కు రూ.2 నుంచి రూ.3 చొప్పున పెట్రోల్‌, డీజిల్‌ ధర తగ్గుతుందని ప్రచారం జరుగుతోంది.

విశ్లేషకుల అభిప్రాయం: ఐసీఆర్‌ఏ కార్పొరేట్‌ రేటింగ్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గిరీశ్‌ కుమార్‌ కదమ్‌ ఇదే విషయాన్ని చెప్పారు. ఈ మేరకు చమురు నిర్వహణ సంస్థలు త్వరలో నిర్ణయం తీసుకుంటారని చూచాయగా చెప్పారు.

నాడు తగ్గుదల: చివరిసారి ఈ ఏడాది మార్చి 15వ తేదీన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటర్‌పై రూ.2 తగ్గిన విషయం తెలిసిందే.

అక్కడే ఎక్కువ: కాగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల విషయానికి వస్తే ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల్లో అధికంగా ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో మాత్రం రూ.వంద లోపు ధరలు ఉండడం గమనార్హం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link