Aadhaar Update: ఆధార్ కార్డు ఉన్నవారికి బంపర్ గుడ్ న్యూస్.. మరోసారి గడువు పెంపు, వెంటనే అప్లై చేయండి..
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 2024 డిసెంబర్ 14 తేదీ వరకు ఉచితంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఇది పదేళ్లు పాతబడిన ఆధార్ కార్డుదారులకు వర్తిస్తుంది.
అయితే నేటితో ఆ గడువు ముగియనుంది. తాజాగా మరోసారి ఈ ఆధార్ కార్డు ఉచితంగా అప్డేట్ చేసుకునే సౌలభ్యాన్ని యూఐడిఏ మరోసారి పెంచింది. ఇది పదేళ్లు పాతబడిన ఆధార్ కార్డుదారులకు మరోసారి గడువు పెంచింది. 2025 జూన్ 14వ తేదీ లోపు ఉచితంగా అప్డేట్ చేసుకునే సదుపాయం కల్పించింది..
'మై ఆధార్' పోర్టల్ ద్వారా ఉచితంగా అప్డేట్ చేసుకునే సౌలభ్యం కూడా కల్పించింది. మిలియన్ల కొద్ది ఆధార్ కార్డుదారులకు ఈ ఉచిత ఆఫర్ వర్తిస్తుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా యూఐడీఏఐ ప్రకటించింది.
పదేళ్లు పాతదైన తమ ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవాలంటే మీ సేవా లేదా ఆన్లైన్లో కూడా అప్డేట్ చేసుకునే సదుపాయం కల్పించారు.
యుఐడిఎఐ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మీ ఆధార్ నంబర్, క్యాప్చా, ఓటిపి మొబైల్ నెంబరు ద్వారా సులభంగా అప్డేట్ చేసుకునే సదుపాయం ఉంది.
దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి ఎందుకంటే ఈ నంబర్ ద్వారా ట్రాకింగ్ చేసుకునే సదుపాయం కలిగి ఉంటుంది.
మీ ఆధార్ కార్డులో ఏ మార్పులు చేసుకోవాలన్న వెంటనే ఆ పని చేయడం మంచిది.. ఎందుకంటే ఆ తర్వాత మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఆధార్ కార్డు అనేది ఏ లావాదేవి చేసినా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి.
ఐదేళ్లలోపు ఉన్న పిల్లలకు కూడా 'బాల్ ఆధార్ కార్డు' మనదేశంలో జారీ చేస్తారు.. అయితే 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆధార్ కార్డు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.. ఇందులో పేరు, ఫోట్, అడ్రస్, ఫోన్ నంబర్ వంటివి అప్డేట్ చేసుకోవచ్చు.