LPG Cylinder Price Hike: ఫస్ట్‌రోజే సామాన్యులకు బిగ్ షాక్! ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపు.. నగరాలవారీగా ధరలు ఎలా ఉన్నాయంటే?
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) శుక్రవారం ఈ ధరల సవరణను ప్రకటించాయి. దీంతో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ ధర రూ.25.50 పెరిగింది. ఈ ధరలు నేడు అంటే మార్చి 1 నుంచే అమలు కానున్నాయి.
ఈ ధరల సవరణ తర్వాత 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర (రిటైల్) ఢిల్లీలో రూ.1795, ముంబైలో రూ.1960.
ఇదిలా ఉండగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ అంటే 14 కిలోల సిలిండర్ ధర మాత్రం పెరగలేదు.. ప్రతినెలా మొదటిరోజు డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల సవరణ జరుగుతుంది.
డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు రాష్ట్రాలవారీగా వేర్వేరుగా ఉంటాయి. స్థానిక పన్నులు, సిలిండర్ ధరల చివరి సవరణ ధరలు వంటి ఆధారంగా ఉంటాయి.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ లక్నో, అహ్మదాబాద్‌లో రూ.1816, చెన్నైలో రూ.1960, ఇండోర్ రూ.1901, జైపూర్ రూ.1818, ఆగ్రాలో రూ.1843 అందుబాటులో ఉంటుంది.
అంతేకాదు ATF ధరలు వరుసగా తగ్గించిన ఓఎంసీ విమాన ఇంధన ధరలను పెంచేసింది. ప్రస్తుతం లీటరు దాదాపు రూ.624,37 ఇవి కూడా నేటి నుంచే వర్తిస్తాయి.