YS Abhishek Reddy: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తమ్ముడు ఆకస్మిక మృతి

Tue, 07 Jan 2025-10:33 pm,

వైఎస్‌ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సోదరుడు హఠాన్మరణం పొందాడు.

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అభిషేక్‌ రెడ్డి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం.

వైఎస్ ప్రకాశ్‌ రెడ్డి మనుమడు వైఎస్ అభిషేక్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సోదరుడి వరుస అవుతాడు.

కుటుంబపరంగానే కాకుండా రాజకీయాల్లో జగన్‌కు సహకారంగా అభిషేక్‌ పని చేశాడు.

వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శిగా వైఎస్ అభిషేక్ రెడ్డి బాధ్యతలు నెరవేర్చాడు.

గతేడాది జరిగిన ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కడప జిల్లా లింగాల మండల ఇన్‌చార్జిగా వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో అభిషేక్‌ రెడ్డి పనిచేశాడు.

అతడి మృతితో వైఎస్‌ కుటుంబంతోపాటు వైఎస్సార్‌సీపీలోనూ తీవ్ర విషాదం అలుముకుంది.

కడప జిల్లాలో బుధవారం అభిషేక్‌ అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. అభిషేక్‌కు వైఎస్‌ జగన్‌ దంపతులు నివాళులర్పించనున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link