8th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 8వ పే కమీషన్.. ఎవరికి ఎంత జీతం అంటే..?
ప్రస్తుతం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు.. కోసం వేచి ఉన్న నేపథ్యంలో.. ఒకవేళ అమలు చేస్తే ఎవరికి ఎంత జీతం పెరుగుతుంది అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. సాధారణంగా ఒక వేతన కమిషన్ అమలు చేసిన తర్వాత కొత్త వేతన కమిషన్ అమలు చేయడానికి దాదాపు పది సంవత్సరాల సమయం పడుతుంది.
ఈ నేపథ్యంలనే ఎనిమిదవ వేదన కమిషన్ ను రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుండడం వల్ల అటు ఉద్యోగులకు ఇటు పెన్షనర్లకు మంచి రాబడి లభించబోతోంది.
ఇకపోతే ఎనిమిదవ వేతన సంఘం అమలు విషయంపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు నిరాశతో ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఎనిమిదవ వేతన సంఘం కేంద్ర ఉద్యోగుల పే స్కేల్ నిర్మాణం, అలవెన్సులు , పెన్షన్లను దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత ఉద్యోగుల ద్రవ్యోల్బన కారకాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సర్దుబాట్లు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇకపోతే రాబోయే ఎనిమిదవ వేతన సంఘం 2026 జనవరి నుండి అమలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లను దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తుంది. పే కమిషన్ ఏర్పాటుతో ఉద్యోగుల జీతం పెరుగుతుందని ,పెన్షనర్ల పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుందని అందరికీ తెలుసు
ఇకపోతే ఎనిమిదవ వేతన సంఘం అమలులోకి వస్తే ఏ ఉద్యోగి కైనా కనీస వేతనం నెలకు రూ.18000 ఉంటే.. పే కమిషన్ అమలులోకి వస్తే ఈ వేతనం రూ.34,560 కి చేరుకుంటుంది ఈ జీతం సంఖ్యను బట్టి ఉద్యోగుల దృక్కోణం నుండి కొత్త పే కమిషన్ ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ప్రస్తుతం ఉన్న బేసిక్ శాలరీ కంటే ఇది రెట్టింపు అవుతుంది అనడంలో సందేహం లేదు.