Bigg Boss Arohi Photos : ఆరోహి అదరగొట్టేసింది.. బిగ్ బాస్ బ్యూటీ పేపర్ డ్రెస్
బిగ్ బాస్ ఇంట్లో ఆరోహి ఉన్నది నాలుగు వారాలే. కానీ ఆరోహికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది. టాస్కులు ఆడటం అయినా, తన గురించి స్టాండ్ తీసుకోవడమైనా కూడా ఆరోహి ముందుండేది.
బిగ్ బాస్ షోలో చివరి వరకు ఉండాలని వచ్చిన ఆరోహికి మధ్యలోనే ఎదురుదెబ్బ తగిలింది. బిగ్ బాస్ ఇంట్లో నాలుగు వారాలే ప్రయాణం సాగించింది ఆరోహి.
ఆర్జే సూర్య, ఆరోహిల ట్రాక్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. ఆరోహి, సూర్యలను సురోహి అంటూ జనాలు ముద్దుగా పిలవసాగారు.
ఆరోహి బయటకు వచ్చినా కూడా బిగ్ బాస్ షోను ఫాలో అవుతూనే ఉంది. బిగ్ బాస్ ఇంట్లో కీర్తిని సపోర్ట్ చేస్తూ ఆరోహి పోస్టులు పెడుతూనే ఉంది.
తాజాగా ఆరోహి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో పేపర్ డ్రెస్సును ధరించింది. ఆమె టాప్ పేపర్ డ్రెస్సులా కనిపిస్తోంది. ఇక ఇందులో ఆరోహి చూపుల వలకు ఎవ్వరైనా చిక్కాల్సిందే అన్నట్టుగా ఉంది.