Bigg Boss Vishnu Priya: ఎన్ని కోట్లు ఇచ్చినా వెళ్లనంటూ బిగ్‌బాస్ హౌస్‌లోకి జంప్.. యాంకర్ విష్ణు ప్రియపై ట్రోల్స్
ముందుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది విష్ణు ప్రియ. తెలుగు, తమిళ భాషల్లో చిన్న చిన్న పాత్రలతో అవకాశాలు వచ్చినా.. పెద్దగా గుర్తింపు దక్కలేదు.
దీంతో బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. సుడిగాలి సుధీర్‌తో కలిసి పోవే పోరా షోకు హోస్ట్‌గా పనిచేసింది. ఈ షోతో మంచి పాపులారిటీ దక్కించుకుంది.
ఆ తరువాత కొన్ని టీవీ షోలకు యాంకర్‌గా వర్క్ చేసి.. బుల్లి తెర ఆడియన్స్‌ను అలరించింది.
తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. అయితే గతంలో ఈ భామ బిగ్ బాస్ గురించి చేసిన కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి.
బిగ్‍బాస్ హౌస్‌లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లనని.. కనీసం ఎంకరేజ్ కూడా చేయనని చెప్పింది.
ఎన్ని కోట్లు ఇచ్చినా తాను వెళ్లనన స్పష్టం చేసింది. ప్రపంచం చాలా బ్యూటీఫుల్‌గా బయట ఉన్నప్పుడు ఎందుకు ఏదో హౌస్‌లో ఉండాలని అడిగారు.
తాను ఇంట్లో వాళ్లను చూసుకోవాలని చెప్పింది విష్ణుప్రియ. తాను బిగ్ బాస్ ఎప్పుడు చూడలేదని తెలిపింది.
ఈ వీడియో ఐదేళ్ల క్రితంది కాగా.. ప్రస్తుతం వైరల్ అవుతోంది. కొందరు ట్రోల్స్ చేస్తుండగా.. మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.